అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేస్తున్న శాశ్వత నివాస సర్టిఫికెట్ పెను వివాదానికి దారి తీసింది. అరుణాచల్ రాష్ట్రానికి చెందని కొన్ని షెడ్యూల్ తెగలకు కూడా ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీ చేస్తోందని స్థానికులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో రాజధాని ఈటానగర్‌లోని రాష్ట్ర డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ ఇంటిపై శనివారం దాడి చేసిన కొంతమంది నిరసనకారులు.. బంగ్లాకు నిప్పు పెట్టారు. దీంతో డిప్యూటీ సీఎం ఆదివారం ఉదయం ఈటానగర్ నుంచి నామ్‌సాయికి తన మకాం మార్చారు.
నిరసనకారులను అదుపుచేసేందుకు శుక్రవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. దాదాపు 50 కార్లతో పాటు ఇతర వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారు. ఓ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నాగాలాండ్ నుంచి వచ్చిన ఓ మ్యూజిక్ బ్యాండ్‌పై కూడా నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. అరుణాచల్‌లో పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పెద్ద ఎత్తున మిలటరీ బలగాలను రప్పిస్తున్నారు. చాలాచోట్ల కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం ఇప్పటికే ఆరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలను రంగంలోకి దింపింది.
#WATCH Permanent residence certificate row: Violence broke out in Itanagar during protests against state’s decision to grant permanent resident certificates to non-#ArunachalPradesh Scheduled Tribes of Namsai & Chanaglang; Deputy CM Chowna Mein's private house also vandalised. pic.twitter.com/FrcmqWbL8c
— ANI (@ANI) February 24, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime