Arun Jaitley | సెహ్వాగ్, కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌ను మలుపుతిప్పిన అరుణ్ జైట్లీ

Arun Jaitley | అరుణ్ జైట్లీ ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1999 నుంచి 2013 వరకు అరుణ్ జైట్లీ డీడీసీఏ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు.

news18-telugu
Updated: August 24, 2019, 2:28 PM IST
Arun Jaitley | సెహ్వాగ్, కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌ను మలుపుతిప్పిన అరుణ్ జైట్లీ
అరుణ్ జైట్లీ, వీరేంద్ర సెహ్వాగ్
  • Share this:
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాజ్యసభ ఎంపీ అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. దేశంలోనే ప్రముఖ రాజకీయనాయకుడిగా, న్యాయవాదిగా ఆయన అందరికీ సుపరిచితుడు. అయితే, ఆయన ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1999 నుంచి 2013 వరకు అరుణ్ జైట్లీ డీడీసీఏ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. ఆ సమయంలో ఎందరో ప్రతిభ ఉన్న ఢిల్లీ క్రికెట్ ప్లేయర్లకు భారత జట్టులో స్థానం దక్కేలా చూడగలిగారు. అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడికాక ముందు టీమిండియాలో ఢిల్లీ నుంచి ప్లేయర్లు తక్కువ శాతం ఉండేవారు. అయితే, జైట్లీ వచ్చాక మొత్తం మారిపోయింది. సెహ్వాగ్ లాంటి ప్రతిభ కలిగిన ఎందరికో భారతజట్టులో స్థానం దక్కేలా కృషి చేశారు. తాను భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించడంలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించారని సాక్షాత్తూ సెహ్వాగ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.



సెహ్వాగ్ ఒక్కడే కాదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్ లాంటి వారికి కూడా అరుణ్ జైట్లీ అండదండలు ఉన్నాయి. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడమే కాకుండా, ప్లేయర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించేవారని సెహ్వాగ్ చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 24, 2019, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading