Arun Jaitley Birth Anniversary: నేడు అరుణ్ జైట్లీ జయంతి. కీలక సంస్కరణలకు బాటవేసిన నేత

అరుణ్ జైట్లీ (File Image)

Arun Jaitley Birth Anniversary: కొంత మంది నేతలను మనం మళ్లీ మళ్లీ స్మరించుకుంటాం. వాళ్లు మన దేశానికి చేసిన సేవ అలాంటిది. అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుందాం.

  • Share this:
    Arun Jaitley Birth Anniversary: డిసెంబర్ 28న అరుణ్ జైట్లీ జయంతి. ఓ రాజకీయ నేతగా, అటార్నీగా సేవలందించన అరుణ్ జైట్లీ.. 2014-2019 NDA ప్రభుత్వ హయాంలో... కేంద్ర ఆర్థిక మంత్రిగా ఐదేళ్లపాటూ పనిచేశారు. తన హయాంలో ఆయన... వస్తు సేవల పన్ను (Goods and Services Tax - GST)ని తీసుకొచ్చారు. సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ని కలిపేశారు. నోట్ల రద్దు కూడా జరిగింది ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే. అరుణ్ జైట్లీ 68వ జయంతి సందర్భంగా... దాదాపు 50 ఏళ్లపాటూ... ఆయన రాజకీయ జీవితం ఎలా సాగిందో తెలుసుకుందాం. జైట్లీ 1970లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ABVP అభ్యర్థిగా 1974లో ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాతి సంవత్సరమే... అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ... దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

    జైలు జీవితం:
    1973లో జయ ప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ఏకంగా 19 నెలల పాటూ జైల్లో గడిపారు. 1977లో ABVPకి ఆల్ ఇండియా సెక్రెటరీగా నియమితులయ్యారు. మూడేళ్ల తర్వాత... భారతీయ జనతా పార్టీ (BJP) యూత్ వింగ్‌కి అధ్యక్షుడు అయ్యారు.

    లా ప్రాక్టీస్:
    1987 నుంచి జైట్లీ... సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులలో లా ప్రాక్టీస్ చేశారు. రెండేళ్ల తర్వాత... కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పుడు... వీపీ సింగ్ ప్రభుత్వంలో ఆయన... అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. అప్పటికి ఆయన వయసు 37 ఏళ్లు. దేశంలో అతి చిన్న వయసులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయిన రికార్డు ఆయన పొందారు. బోఫోర్స్ కుంభకోణంలో... రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు జైట్లీ. ఆ తర్వాత దశాబ్ద కాలంలో... అద్భుతమైన వాదనా పటిమతో ఆయన... ఎల్కే అద్వానీ, నరేంద్ర మోదీ లాంటి వారి తరపున బలంగా వాదించారు.

    బీజేపీ తోనే:
    2003లో జైట్లీ బీజేపీ అధికార ప్రతినిధి అయ్యారు. ఐతే... 2004 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ఓడిపోవడంతో... జైట్లీ తిరిగి తన లా ప్రాక్టీస్ కెరీర్ కొనసాగించారు. 2009లో ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు. 2014లో బజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే జైట్లీ... ఆర్థిక మంత్రిగా, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా, రక్షణ మంత్రిగా చేశారు.

    ఇది కూడా చదవండి:Grahan 2021: వచ్చే సంవత్సరం రాబోయే గ్రహణాలు ఎన్ని... తేదీలు, సమయాలు ఇవీ

    తన హయాంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని దీటుగా ఎదుర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాల్ని స్వాగతించిన ప్రజలు 2019 సాధారణ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి భారీ మెజార్టీ ఇచ్చారు.
    Published by:Krishna Kumar N
    First published: