Video: బయట నిమ్మరసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త... ఓ రైల్వేస్టేషన్‌లో సీన్ చూడండి

సెంట్రల్ రైల్వే పరిధిలో నిమ్మరసం, ఆర్టిఫిషియల్ సిరప్‌తో తయారు చేసే ఇతర డ్రింక్స్‌ను నిషేధించారు అధికారులు. అయితే సహజంగా తయారు చేసే జ్యూస్‌లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: March 29, 2019, 10:19 AM IST
Video: బయట నిమ్మరసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త... ఓ రైల్వేస్టేషన్‌లో సీన్ చూడండి
Video: నిమ్మరసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 29, 2019, 10:19 AM IST
అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయని ఎక్కడపడితే అక్కడ నిమ్మరసం తాగుతున్నారా? రైల్వే స్టేషన్‌లో కనిపించే లెమన్ జ్యూస్ నోరూరిస్తోందా? అయితే జాగ్రత్త. కృత్రిమ నిమ్మరసాలతో రోగాలు తప్పవు. మహారాష్ట్రలోని కుర్లా రైల్వేస్టేషన్‌లో ఇలాంటి ఘటనే బయటపడింది. రైల్వేస్టేషన్‌లో అమ్మే నిమ్మరసం తయారీని ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి పోస్ట్ చేశాడు. అపరిశుభ్ర వాతావరణంలో తాగడానికి కూడా పనికిరాని నీళ్లతో నిమ్మరసం తయారు చేస్తున్న తీరు కలకలం రేపింది. అది కూడా నిమ్మకాయలతో కాకుండా ఆర్టిఫిషియల్ సిరప్‌తో తయారు చేసిన నిమ్మరసం అది. ఆ నిమ్మరసాన్ని ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులకు అమ్ముతున్నారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో సెంట్రల్ రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. కుర్లా స్టేషన్‌లోని ఓ ఫుడ్ స్టాల్‌ను మూసేశారు. నిమ్మరసం శాంపిల్ తీసుకొని ల్యాబ్‌కు పంపారు. విచారణకు ఆదేశించారు. సెంట్రల్ రైల్వే పరిధిలో నిమ్మరసం, ఆర్టిఫిషియల్ సిరప్‌తో తయారు చేసే ఇతర డ్రింక్స్‌ను నిషేధించారు అధికారులు. అయితే సహజంగా తయారు చేసే జ్యూస్‌లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. ముంబై డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో హెల్త్ ఇన్‌స్పెక్టర్లతో తనిఖీ చేయిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ జ్యూస్‌ల అమ్మకం రైల్వేస్టేషన్‌లో మాత్రమే కాదు... ప్రతీ చోటా మామూలైపోయింది. వీటి వల్ల ఆరోగ్యానికి చేటు తప్పదు. కృత్రిమ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పుపై అవగాహన లేక జనం వాటిని తాగుతూ రోగాలపాలవుతున్నారు.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్



ఇవి కూడా చదవండి:
Loading...
Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా

DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000

RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ
First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...