కశ్మీర్‌లో 50 వేల ఆలయాలు, స్కూళ్లను పునరుద్ధరిస్తాం: కిషన్ రెడ్డి

గత 20 ఏళ్లుగా కశ్మీర్‌లో ఎన్నో సినిమా హాళ్లు మూతపడ్డాయని వాటిని కూడా తెరుస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. ఆర్టికల్ 370 రద్దైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రూపురేఖలు పూర్తి మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

news18-telugu
Updated: September 23, 2019, 5:50 PM IST
కశ్మీర్‌లో 50 వేల ఆలయాలు, స్కూళ్లను పునరుద్ధరిస్తాం: కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి
  • Share this:
కశ్మీర్‌లో గత కొన్నేళ్లుగా వేలాది ఆలయాలు, స్కూళ్లు మూతపడ్డాయన్నారు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. వాటన్నింటినీ పునరుద్ధరిస్తామని స్పష్టంచేశారు. కశ్మీర్‌లో మూతపడ్డ ఆలయాలు, ధ్వంసమైన విగ్రహాలు, మూతపడిన స్కూళ్ల కోసం త్వరలోనే సర్వే చేపడతామని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు గత 20 ఏళ్లుగా కశ్మీర్‌లో ఎన్నో సినిమా హాళ్లు మూతపడ్డాయని వాటిని కూడా తెరుస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. ఆర్టికల్ 370 రద్దైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రూపురేఖలు పూర్తి మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కశ్మీర్‌లో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. కశ్మీర్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చే వారు భూములను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని.. వారికి ప్రభుత్వమే భూములను కేటాయిస్తుందని చెప్పారు. కశ్మీర్‌లో ప్రతి ఊరి నుంచి ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుక ప్రణాళిక రూపొదిస్తున్నామని.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పీవోకే ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనన్న కిషన్ రెడ్డి.. పీవోకే కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టంచేశారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>