మోదీ నామినేషన్ కోసం లక్షన్నర లీటర్ల నీరు వృధా

వారణాసిలో నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు నరేంద్రమోదీ రోడ్ షో

ప్రధాని నరేంద్రమోదీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా వారణాసి రోడ్లను శుభ్రం చేసేందుకు దాదాపు లక్షన్నర లీటర్ల తాగునీటిని వృధా చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    ప్రధాని నరేంద్రమోదీ నామినేషన్ సందర్భంగా వారణాసిలోని ప్రధాన కూడళ్లను ఎంతో సుందరంగా అలకరించిన స్థానిక ప్రభుత్వం... రోడ్లను శుభ్రం చేసేందుకు భారీగా మంచినీటిని వృధా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నియ. దాదాపు లక్షన్నర లీటర్ల తాగునీటిని గురువారం రాత్రి వారణాసిలో రోడ్లను శుభ్రం చేసేందుకు వినియోగించినట్టు తెలుస్తోంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తుండటంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ వారణాసి వీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్లను శుభ్రం చేయాలంటూ తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ పలువురు అధికారులు తెలిపారు.

    వారణాసి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన దాదాపు 40 ట్యాంకర్లు, 400 మంది కార్మికులు ఇందుకోసం శ్రమించారు. సాధారణంగా కేవలం పండగల సమయంలోనే ఇలా రోడ్లను నీటితో శుభ్రం చేస్తుంటారు. వారణాసి అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం అయినప్పటికీ... ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 శాతం ఇళ్లకు మాత్రమే పైప్‌లైన్ల ద్వారా నీరు అందుతోంది. మిగతా చోట్ల ప్రజలంతా నీటి కోసం బోర్ల మీదే ఆధారపడుతున్నారు. అంతకుముందు బుందేల్‌ఖండ్‌లోని బండాలో మాట్లాడిన నరేంద్రమోదీ... మరోసారి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే తాగునీటి కోసం పనులు మొదలవుతాయని అన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామని తెలిపారు. నదీ జలాలు, వర్షపు నీటిని సక్రమంగా వాడుకునే టెక్నాలజీని ఉపయోగిస్తామని అన్నారు.




    First published: