హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian Army Uniform: ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫారం.. సౌకర్యవంతమైన, లైట్ వెయిట్ దుస్తుల తయారీ

Indian Army Uniform: ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫారం.. సౌకర్యవంతమైన, లైట్ వెయిట్ దుస్తుల తయారీ

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Army Uniform: ఆర్మీ దినోత్సవమైన జనవరి 15న జరిగే పరేడ్‌లో ఈ సరికొత్త యూనిఫారంను తొలిసారి ప్రదర్శించనున్నారు. విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ దుస్తులను ఖరారు చేశామని, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సలహాలు కూడా తీసుకున్నామని ఓ అధికారి తెలిపారు.

ఇంకా చదవండి ...

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిలో భారత ఆర్మీ (Indian Army) ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 13 లక్షల మంది సైనికులు (Soldiers) ఇక్కడ పనిచేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కంబాట్ యూనిఫారంను (Uniform) మొదటి నుంచి పెద్దగా మార్చలేదు. అయితే త్వరలో సరికొత్త డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫారాన్ని తీసుకొచ్చేందుకు రక్షణ శాఖ (Defence Department)  సన్నాహాలు చేస్తోంది. ఇవి బరువు తక్కువగా ఉండేలా, పర్యావరణ హితంగా, ఫోర్స్ ఆపరేషన్స్‌కు అనుకూలించే విధంగా ఉండనున్నాయి. ఈ దుస్తులు (Clothes) విభిన్న రంగుల సమ్మేళనంగా ఉంటాయని తెలుస్తోంది. ఆర్మీ దినోత్సవమైన (Army Day) జనవరి 15న జరిగే పరేడ్‌లో ఈ సరికొత్త యూనిఫారంను తొలిసారి ప్రదర్శించనున్నారు. విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ దుస్తులను ఖరారు చేశామని, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సలహాలు కూడా తీసుకున్నామని ఓ అధికారి తెలిపారు. ఇతర దేశాల మిలిటరీ యూనిఫారాలను సైతం పరిశీలించినట్లు ఆయన స్పష్టం చేశారు.

త్వరలో రానున్న ఈ సరికొత్త యూనిఫారంలో చొక్కాను ప్యాంటులోకి టక్ చేయాల్సిన అవసరం లేదట. అయితే ప్రస్తుతమున్న దుస్తులకు ఉండే షైనీ స్టార్లు, బ్యాడ్జీలు, కాలర్ ట్యాబ్స్ కోసం ఉండే సదుపాయల విషయంపై స్పష్టం లేదు. ఇప్పుడు ఉన్న యూనిఫారం కంటే కొత్తది మెరుగ్గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సరికొత్త దుస్తులను వేసవి, శీతాకాలం లాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసినట్లు మరో అధికారి తెలిపారు. ప్రస్తుతమున్న రెగ్యులర్ యూనిఫారం స్థానంలో ఈ సరికొత్త కంబాట్ దుస్తులను భర్తీ చేస్తామని చెప్పారు.

Mamata Banerjee: జాతీయ గీతాన్ని అవమానిస్తారా? మమతా బెనర్జీపై కేసుపెట్టిన బీజేపీ నేత


ఇండియన్ నేవీ గతేడాదే డిజిటల్ కామోఫ్లాజ్ ప్యాటర్న్ యూనిఫారాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకు ముందున్న లైట్ బ్లూ హాఫ్ స్లీవ్ దుస్తులను ఈ కొత్త యూనిఫారంతో భర్తీ చేసింది. ఆర్మీ, నేవీ, వాయుసేనలకు విభిన్న రకాల యూనిఫారాలు ఉంటాయి. సందర్భానుసారం విభిన్న దుస్తులను ధరిస్తారు. ఇందుకోసం అధికారులకు వేతనంతో పాటు ఏడాదికి 20 వేల రూపాయల డ్రెస్ అలవెన్స్ ఇస్తారు. దిగువ ర్యాంక్ హోల్డర్లకు 10వేల రూపాయల అలవెన్స్ ఇస్తారు. సియాచిన్ గ్లేసియర్ రిడ్జ్ లాంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో, సబ్ మెరైన్ లో పనిచేసే సైనికులకు ప్రభుత్వమే ప్రత్యేక దుస్తులను అందిస్తుంది.

Fishermen missing: అల్లకల్లోలంగా సముద్రం.. 15 పడవలు బోల్తా.. మత్స్యకారులు గల్లంతుత్వరలో తీసుకురానున్న ఆర్మీ కాంబాట్ యూనిఫారాన్ని వ్యక్తిగత అవసరాలకు ధరించకూడదు. ఎందుకంటే జనాల్ని నియంత్రించేందుకు ఆర్మీ ప్రత్యేక బలగాలను ప్రవేశపెట్టిందనే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల అవసరమైనప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో కంబాట్ యూనిఫారం ధరించకూడదనే కఠిన నిబంధనలు ఉన్నాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Defence Ministry, Indian Army

ఉత్తమ కథలు