కశ్మీర్ నుంచి 70 మంది టెర్రరిస్టుల తరలింపు..ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

మరోవైపు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగులంతా తక్షణం విధుల్లో హాజరుకావాలని స్పష్టం చేశారు.

  • Share this:
    ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్ లోయ నివురు గప్పిన నిప్పులా మారింది. నాలుగు రోజుల తర్వాత పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కర్ఫ్యూని సడలిలిస్తున్నారు. ప్రజలు కూడా బయటకు వచ్చి తమ తమ పనులు చేసుకుంటున్నారు. ఐతే ఈ నాలుగు రోజుల్లో కశ్మీర్ లోయలో ఇండియన్ ఆర్మీ భారీ ఆపరేషనే చేపట్టినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సుమారు 70 మంది ఉగ్రవాదులను కశ్మీర్‌ లోయ నుంచి తరలించారు. వారిని స్పెషల్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్‌లో ఆగ్రాకు తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగులంతా తక్షణం విధుల్లో హాజరుకావాలని స్పష్టం చేశారు. సాంబా ప్రాంతంలో రేపటి నుంచి స్కూళ్లు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించారు.    Published by:Shiva Kumar Addula
    First published: