ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ పరొక్షంగా ఓ మహిళ ప్రాణాలు పోయేందుకు కారణమయ్యింది. ఓ ఆర్మీ జవాను తన పేరును వలసొచ్చిన వారి జాబితాలో చేర్చిన విషయంలో వాగ్వాదం జరగడంతో ఓ మహిళను గన్‌తో కాల్చి చంపాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ మైన్‌పురిలోని అలీపూర్ గ్రామ పెద్దలు ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వలసొచ్చిన వారి పేర్ల జాబితాను రూపొందించాలని వినయ్ యాదవ్ అనే వ్యక్తికి బాధ్యత అప్పగించారు. అందులో భాగంగానే వినయ్ యాదవ్ ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామానికి వచ్చిన వారి పేర్ల జాబితాను అధికారులకు అందజేశారు.
అయితే అందులో ఆర్మీ జవాను శైలేంద్ర, అతడి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. దీంతో ఆగ్రహం చెందిన సదరు జవాను శైలేంద్ర తమ పేర్లను జాబితాలో ఎందుకు చేర్చావంటూ వినయ్ యాదవ్‌తో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే వినయ్‌కు ఓ మహిళతో పాటు మరో వ్యక్తి అండగా నిలిచారు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన శైలేంద్ర.. సదరు మహిళను తుపాకీతో కాల్చగా, మహిళ అక్కడికక్కడే మరణించింది. దీంతో పోలీసులు శైలేంద్రను అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Gun fire, Uttar pradesh, Women