భారత సైన్యంపై పాకిస్థాన్ గురి... వాట్సాప్ ద్వారా ఎత్తుగడ

WhatsApp : వాట్సాప్ సెట్టింగ్స్ మార్చుకోమని ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు వెళ్లాయి. పాకిస్థాన్ కుతంత్రాలను అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

news18-telugu
Updated: November 23, 2019, 9:47 AM IST
భారత సైన్యంపై పాకిస్థాన్ గురి... వాట్సాప్ ద్వారా ఎత్తుగడ
భారత సైన్యంపై పాకిస్థాన్ గురి... వాట్సాప్ ద్వారా ఎత్తుగడ
  • Share this:
ఇండియన్ ఆర్మీ ఇటీవల సైన్యానికి ఓ సూచన చేసింది. పాకిస్థాన్‍‌కి చెందిన హ్యాకర్లు... కొన్ని వాట్సాప్ గ్రూపులలో భారత సైనికుల్ని ఆటోమేటిక్‌గా కలుపుకుంటూ ఉండటంపై అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇష్టమొచ్చినట్లు ఇతర గ్రూపుల్లో కలుపుకునే ఛాన్స్ లేకుండా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోమని సలహా ఇచ్చింది. అలాగే... ఏదైనా గ్రూపులో అనుకోకుండా చేరితే... వెంటనే బయటకు వచ్చేయాలని కోరింది. అలాగే... తెలియనివారికి వ్యక్తిగత సమాచారం ఏదీ ఇవ్వవద్దని సూచించింది. పాకిస్థాన్‌ నుంచీ క్రియేట్ అవుతున్న కొన్ని గ్రూపుల్లో సభ్యులు... భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సేకరించేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం భారత సైనికుల్ని గ్రూపుల్లో కలిపేసుకుంటున్నారు. అలాంటిదేదైనా జరిగితే... వెంటనే సమాచారం ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ ఆదేశించింది.

ఇటీవల ఓ భారత సైనికుణ్ని... పాకిస్థాన్ నంబర్ నుంచీ ఏర్పడిన గ్రూప్‌లో కలుపుకున్నారు. వెంటనే అలర్టైన ఆ సైనికుడు... దాన్ని స్క్రీన్ షాట్ తీసి... వెంటనే ఆ గ్రూప్ నుంచీ బయటకు వచ్చేశాడు. స్క్రీన్ షాట్‌ను సైనికాధికారులకు పంపాడు. దాంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇదివరకు ఇలాగే పాకిస్థాన్ గ్రూపులు... అమ్మాయిలను హనీ ట్రాప్ తరహాలో వలవేసి... భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించారు. ఇకపై అలా జరగకుండా సైన్యం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది.

 

Pics : హాట్ అందాల విందు చేస్తున్న ఇరాఖాన్


ఇవి కూడా చదవండి :

ఎయిర్‌పోర్టులో పేలిన విమానం టైరు... ఆ తర్వాత...మహారాష్ట్రలో హైడ్రామా... సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మలైకా అరోరాకి చేదు అనుభవం... కొంపముంచిన డ్రెస్...

జగన్ 6 నెలల పాలనపై పవన్ కళ్యాణ్ 6 అస్త్రాలు...

గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్
First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>