దేశ భద్రతా కారణాల రీత్యా డేటా శత్రు దేశాలకు చేరకుండా. భారత ఆర్మీ జవాన్లు 89 రకాల మొబైల్ యాప్స్ వాడకుండా కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్మీ అధికారి హై కోర్టును ఆశ్రయించారు. లెఫ్టినెంట్ కల్నల్ పి.కె. చౌదరి దాఖలు చేసిన పిటిషన్ లో ప్రభుత్వ నిర్ణయం ‘ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధమని' పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో లెఫ్టినెంట్ కల్నల్ పి.కె. చౌదరి కొత్త పాలసీని "ఏకపక్ష చర్య" అని తన పిటిషన్ లో ఉపసంహరించుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే చైనీస్ యాప్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి యాప్ ల నుంచి వెంటనే జవాన్లు తమ ఖాతాలని తొలగించాలని ఇండియన్ ఆర్మీ జులై 8న ఆదేశాలు జారీ చేసింది. జులై 15 నాటికి జవాన్ లు అంతా తమ ఖాతాలను తొలగించాలని, ఈ ఆదేశాలు పాటించని సైనికులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమ ప్రకటనలో హెచ్చరించింది .
ఈ 89 యాప్స్ లో ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించిన 59 రకాల యాప్స్ కూడా వున్నాయి. చైనా, పాకిస్తాన్ ఇంటలిజెన్స్ వర్గాల నుండి ఇతర దేశాల శత్రు సమాచారం తస్కరించటానికి ప్రయత్నాలు గతంలో చాలా జరిగాయి.ఈ నేపధ్యంలో గతేడాది నవంబర్ లో కేంద్ర ప్రభత్వం భారత్ ఆర్మీకి వాట్సాప్ కూడా వాడొద్దని ఆదేశించింది. కీలక సమాచారాన్ని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశ సరిహద్దులో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జవాన్లకు తమ మొబైల్ ఫోన్ల నుండి ఈ యాప్స్ ను వెంటనే తొలగించాలని ఆర్మీ ఆదేశించింది. గత మూడేళ్ళుగా పలు భారత సైనికాధికారులు, పాకిస్తాన్ ఇంటలిజెన్స్ వర్గాల హనీ ట్రాప్ వలలో చిక్కుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.