హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

poonch encounter : ఉగ్రఘాతుకం -జేసీఓ సహా 5గురు ఆర్మీ జవాన్లు దుర్మరణం -Jammu Kashmirలో మళ్లీ కలకలం

poonch encounter : ఉగ్రఘాతుకం -జేసీఓ సహా 5గురు ఆర్మీ జవాన్లు దుర్మరణం -Jammu Kashmirలో మళ్లీ కలకలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Army JCO and Four soldiers killed in Poonch encounter : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత ఆర్మీ అధికారితోపాటు నలుగురు జవాన్లను బలి తీసుకున్నారు. వరుస ఘటనలతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది..

ఉత్తరాదిలోని కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత భద్రతా బలగాకు చెందిన ఐదుగురిని బలితీసుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపై ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీస్ అధికారులు చెప్పిన వివరాలివి..

పూంచ్ సెక్టార్ లోని సూరంకోట్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో సంయుక్త బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ చేస్తుండగా, ఉగ్రవాదాలు దొంగచాటుగా దెబ్బకొట్టారు. ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీకి చెందిన ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ), మరో నలుగురు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి..

గాయపడ్డ ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అడవిలోనే నక్కిన ఉగ్రవాదుల కోసం సర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. జవాన్ల మరణాలపై నేతలు సంతాపాలు ప్రకటించారు.

కొద్ది రోజుల కిందటే కాశ్మీర్ లో పండిట్ ప్రముఖుణ్ని ఉగ్రవాదులు కాల్చి చంపడం, మరో ఘటనలో స్కూల్లోకి చొరబడి టీచర్లను హతమార్చడం తెలిసిందే. వరుస హత్యాకాండలకు తోడు ఇప్పుడు ఏకంగా ఆర్మీ బలగాలనూ టెర్రరిస్టులు టార్గెట్ చేయడం గమనార్హం.

Published by:Madhu Kota
First published:

Tags: Encounter, Jammu kashmir

ఉత్తమ కథలు