తమిళనాడులో ఘోర హెలికాప్టర్ (Tamilnadu helicopter crash) ప్రమాదం జరిగింది. కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం... నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తునమంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Bipin Rawat, his staff and some family members were in the chopper. pic.twitter.com/6oxG7xD8iW
— ANI (@ANI) December 8, 2021
ఘటనా స్థలం నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఆ మృతదేహాలన్నీ 80 శాతం గాయాలతో ఉన్నాయి. మరికొన్ని మృతదేహాలు కొండ కింది భాగంలో పడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐతే ఆ మృతదేహాలు ఎవరివి అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటన అనంతరం ప్రధాని మోదీ అత్యవసరంగా కేబినెట్ సమవేశాన్ని ఏర్పాటు చేశారు.
The local military officers have reached the location and were told that locals have taken two bodies with 80 per cent burns to a local hospital. Few bodies can be seen downhill in the area of the accident. Efforts are on to retrieve the bodies and check identities: Sources
— ANI (@ANI) December 8, 2021
ఐతే హెలికాప్టర్ కుప్పకూలడానికి కారణమేంటి? సాంకేతిక సమస్యలతోనే కూలిపోయిందా? లేదంటే కుట్ర కోణం ఏదైనా ఉందా? అనే అంశాలపై ఆర్మీ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army Chief General Bipin Rawa, Bipin Rawat, Helicopter Crash, Indian Air Force, Indian Army, Tamil nadu, Tamilnadu