Army Dog Fought Terrorists : జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ దాడి కుక్క(Army Assault Dog) తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అర్థరాత్రి దక్షిణ కశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్న ఇంటిలోకి సైన్యం జూమ్(ZOOM)అనే పేరుగల దాడి కుక్కను(Assault Dog)పంపిందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారని,ఆ సమయంలో జూమ్..వారిని గుర్తించి వెంబడించింది.
అయితే ఆపరేషన్ సమయంలో జూమ్ కుక్కకు రెండు తుపాకీ బుల్లెట్లు తగిలినా.. పోరాడుతూనే ఉందని, తన పనిని చేస్తూనే ఉండటంతో ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాలు ఉన్నప్పటికీ జూమ్ వెన్ను చూపలేదని తెలిపారు. జూమ్‌ను స్థానిక ఆర్మీ వెట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ అది చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు జవాన్లు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా,"జూమ్ అనేది అత్యంత శిక్షణ పొందిన, క్రూరమైన, నిబద్ధత కలిగిన కుక్క. టెర్రరిస్టులను గుర్తించడానికి,పట్టుకునేందుకు శిక్షణ పొందింది" అని అధికారులు చెప్పారు. దక్షిణ కశ్మీర్లో జూమ్ అనేక క్రియాశీల కార్యకలాపాలలో భాగమైందని వారు తెలిపారు.
We wish Army assault dog 'Zoom' a speedy recovery. #Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/i1zJl0C2Gw
— Chinar Corps???? - Indian Army (@ChinarcorpsIA) October 10, 2022
మనిషా లేక ఇంకేమైనానా : జంతువుల శరీర పచ్చి భాగాలను కరకర నమిలేస్తున్నాడు
మరోవైపు,ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో..కుక్క అత్యుత్సాహం, పులి నెమ్మదితనం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాధారణంగా అయితే పులి చేతిని ఏదైనా దొరికితే ఇక ఆ జంతువు పులి దృష్టిలో బిర్యానీ అయిపోయిట్టే. అయితే వైరల్ వీడియోలో మాత్రం.. ఓ జూలో సరదాగా పులి చెవిని కొరుకుతున్న కుక్క అందరికంటా పడింది. పక్కనే ఉన్న సింహం ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించడం అదంతా జూకు వచ్చిన విజిటర్స్ చూసి ముచ్చట పడటం జరుగుతోంది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dog, Jammu and Kashmir