భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీడీఎస్) గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ పదవిలో ఉన్న బిపిన్ రావత్ మూడేళ్ల పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుంది. దీంతో బిపిన్ రావత్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరానే భారత ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్ 1978 డిసెంబర్‌లో ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2017 జనవరి 1 నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆయన నియామకం ఈనెల 31 నుంచి అమల్లోకి వస్తుంది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసింది. కొత్తగా మార్పులు చేసిన దాని ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ 65 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ విధి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.