Home /News /national /

ARMY AND POLICE FIGHT AFTER INSPECTOR CAR COLLIDED ARMY TRUCK IN HARIDWAR PVN

Army-Police Fighting : పోలీసులు-జవాన్ల మధ్య ఫైటింగ్..రోడ్డుపై హైడ్రామా!

పోలీస్-జవాన్ ఫైటింగ్

పోలీస్-జవాన్ ఫైటింగ్

 Army-Police Fighting :  ఉత్తరాఖండ్(Uttarakhand)రాష్ట్రంలోని హరిద్వార్‌(Haridwar)లోని డెహ్రాడూన్-ఢిల్లీ హైవేపై గంటకుపైగా హైఓల్టేజ్​ డ్రామా నడిచింది.పోలీసులకు(Police), ఆర్మీ(Army) సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత విషయం కొట్లాట దాకా వెళ్లింది.

ఇంకా చదవండి ...
Army-Police Fighting :  ఉత్తరాఖండ్(Uttarakhand)రాష్ట్రంలోని హరిద్వార్‌(Haridwar)లోని డెహ్రాడూన్-ఢిల్లీ హైవేపై గంటకుపైగా హైఓల్టేజ్​ డ్రామా నడిచింది.పోలీసులకు(Police), ఆర్మీ(Army) సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత విషయం కొట్లాట దాకా వెళ్లింది. ఈ వివాదంలో స్థానికులు కూడా ఆర్మీ సిబ్బందికి మద్దతుగా నిలిచారు. ఈ వివాదంతో రహదారిపై చాలాసేపు జామ్‌ ఏర్పడింది.

అసలేం జరిగిందంటే

భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహించే అనిల్ సింగ్ బిష్త్..శుక్రవారం కోర్టుకు వెళ్లి తన ప్రైవేట్ కారులో రూర్కీ నుండి భగవాన్‌పూర్‌కు తిరిగి వస్తున్నారు. ఆయన కారు రాంనగర్ సమీపంలోకి రాగానే వెనుక వెనుక నుంచి సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ కారు ధ్వంసమైంది. ఆర్మీ వాహనాన్ని ఆపి చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ సిద్దమయ్యారు. ఆర్మీ సిబ్బందిని ట్రక్కుతో సహా పోలీస్​స్టేషన్​కు రమ్మని సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ చెప్పారు. ఓ కానిస్టేబుల్ ఆర్మీ ట్రక్కుని అక్కడి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం పెరిగింది. ఆర్మీ సిబ్బందికి, ఇన్‌స్పెక్టర్‌కు మధ్య వాగ్వాదం తోపులాటగా మారింది. కాసేపటికి జనం గుమిగూడారు. అక్కడ ఉన్న ప్రజలు సైనికులకు మద్దతుగా నిలిచారు. ఈ గొడవను చూసిన జనం ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ వివాదంతో రహదారిపై చాలాసేపు జామ్‌ ఏర్పడింది. పోలీసు బృందం అక్కడికి చేరుకునే సమయానికి ఆర్మీ వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పామని, ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఎస్​ఐ తెలిపారు. దురుసుగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.

Weight loss : ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటే స్విమ్ చేయడం బెటరా?ఈ విషయాలు తెలుసుకోండి

మరోవైపు,బీహర్ లోని (Bihar) పాట్నా సివిల్ కోర్టులో (Patna civil court) ఊహించని పరిణామం సంభవించింది. పాట్నాలోని ఒక హోటల్ లో బాంబు దొరికింది. అప్పుడు దాన్ని విచారణలో భాగంగా.. అధికారులు బాంబు పౌడర్ ఉన్న బాక్స్ ను న్యాయస్థానంలో తీసుకొచ్చారు. అప్పుడు.. జడ్జీ ముందు బెంచ్ మీద పెట్టారు. ఇంతలో షాకింగ్ ఘటన జరింది. కోర్టు ఆవరణలో బాంబు ఉన్న టిఫిన్ బాక్స్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది.

దీంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తిని, లాయర్ లను, అక్కడి నుంచి తరలించారు. కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో అక్కడ గందర గోళమైన వాతావరణం ఏర్పడింది.పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Army, Police, Uttarakhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు