హోమ్ /వార్తలు /జాతీయం /

'వాహనాలతోనే అధిక కాలుష్యం..టపాసులపై ఎందుకు నింద': సుప్రీంకోర్టు

'వాహనాలతోనే అధిక కాలుష్యం..టపాసులపై ఎందుకు నింద': సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో సంపాదించుకునే హక్కు అందరికీ ఉందని..చట్టబద్ధంగా ఉన్న లైసెన్స్‌ను ఎలా రద్దు చేయగలమని పిటిషనర్లని ప్రశ్నించింది. బాణాసంచాపై నిషేధం విధించకుడానే.. పర్యావరణానికి హానీ కలగకుండా ఇతర మార్గాలను అన్వేషించాలని స్పష్టంచేసింది.

  వేడుకలు, దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. ఐతే టపాసుల వల్ల పర్యావరణం కాలుష్యం జరుగుతుండడంతో.. బాణాసంచాపై నిషేధం విధించాలంటూ ఎన్నో స్వచ్చంధ సంస్థలు కోర్టుల్లో కేసులువేశాయి. పూర్తిస్థాయిలో నిషేధించకున్నా గ్రీన్ క్రాకర్స్‌కి మాత్రమే అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కేసులపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనాల వల్లే ఎక్కువ కాలుష్యం జరుగుతోందని..కేవలం బాణాసంచా వెనకాలే ఎందుకు పడతారని పిటిషనర్లను ప్రశ్నించింది.


  అందరు బాణసంచాపైనే ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు? వీటి కంటే ఆటోమొబైల్ వాహనాల వల్లే ఎక్కువ కాలుష్యం జరుగుతుంది. బాణాసంచాపై నిషేధం విధిస్తే క్రాకర్స్ ఇండస్ట్రీ ఏం కావాలి? టపాలసుల తయారుచేసే కార్మికులు, అమ్ముకునే చిరు వ్యాపారుల పరిస్థితి ఏం కావాలి? ప్రజల్ని నిరుద్యోగులుగా మార్చలేం. వాళ్లంతా కుటుంబాలను పోషించుకోవాలి.
  సుప్రీంకోర్టు
  దేశంలో సంపాదించుకునే హక్కు అందరికీ ఉందని..చట్టబద్ధంగా ఉన్న లైసెన్స్‌ను ఎలా రద్దు చేయగలమని పిటిషనర్లని ప్రశ్నించింది. బాణాసంచాపై నిషేధం విధించకుడానే.. పర్యావరణానికి హానీ కలగకుండా ఇతర మార్గాలను అన్వేషించాలని స్పష్టంచేసింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. వాహనాలు, బాణాసంచాల్లో దేని వల్ల ఎంత కాలుష్యం జరుగుతుందో సమగ్ర నివేదికను అందజేయాలని అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నందకర్ణిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది.


  గత ఏడాది దీపావళి సందర్భంగా బాణసంచాపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు. తక్కువ కాలుష్యం వెదజల్లే గ్రీన్ క్రాకర్స్ (పర్యావరణహిత బాణసంచా)ని మాత్రమే వాడాలని..అది కూడా రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకే ఆదేశించింది. అటు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లోనూ అర్ధరాత్రి 11.55 - 12.30 మధ్యే బాణాసంచాను కాల్చాలని ఆంక్షలు విధించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో క్రాకర్స్ అమ్మకాలను బ్యాన్ చేసింది.

  First published:

  Tags: Supreme Court

  ఉత్తమ కథలు