హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే .

శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే .

కొన్ని రకాల మెడిసిన్స్ (Medicines )వ్యక్తుల సెక్సువల్ హెల్త్‌ను, శృంగారాన్ని ఆస్వాదించే సమయాన్ని (Libido) తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారు. ఫలితంగా ఈ డ్రగ్స్ బాధితులపై శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం.

ఇంకా చదవండి ...

వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా మందులు వాడేవారు అనేక సమస్యల బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ వ్యక్తుల సెక్సువల్ హెల్త్‌ను, శృంగారాన్ని ఆస్వాదించే సమయాన్ని (Libido) తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారు. ఫలితంగా ఈ డ్రగ్స్(Drugs) బాధితులపై శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం.. సెక్స్(Sex) డ్రైవ్ లేదా లిబిడోపై ప్రతికూల ప్రభావం చూపే ఏడు రకాల మందులు ఇవే..

పెయిన్‌కిల్లర్లు

పెయిన్‌కిల్లర్లలో అనేక రకాలు ఉంటాయి. ఎలాంటి నొప్పినైనా దూరం చేయగలిగే శక్తి వీటికి ఉంటుంది. అయితే పెయిన్‌కిల్లర్ల(Pain killer)వాడకం పెరిగితే, సెక్సువల్ స్ట్రెన్త్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పురుషులు, స్త్రీలలో లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేసే సెక్సువల్ హార్మోన్ల ఉత్పత్తిని ఈ మందులు తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే వైద్యుల సలహా ప్రకారం, అవసరమైన మోతాదులోనే వీటిని వాడాలి.

యాంటీ డిప్రెసెంట్స్

డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. అయితే వీటిని లిబిడో కిల్లర్స్ అని పిలుస్తారు. సెక్స్‌పై ఆసక్తి కోల్పోవడం, భావప్రాప్తి కలగకపోవడం, స్ఖలన సమస్యలు, కొన్నిసార్లు అస్సలు స్ఖలనం కాకపోవడం, పురుషులలో అంగస్తంభన లోపం.. వంటివి యాంటీ డిప్రెసెంట్స్ వల్ల ఎదురయ్యే సెక్సువల్ సమస్యలు.

బర్త్ కంట్రోలింగ్ పిల్స్

పిల్లలు పుట్టకుండా, గర్భాన్ని వాయిదా వేసే మాత్రలు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ లేదా బర్త్ కంట్రోలింగ్ పిల్స్.. వ్యక్తుల్లో లిబిడో, లైంగిక కోరికను ప్రభావితం చేసే సెక్స్ హార్మోన్ల స్థాయిలను తగ్గించవచ్చు.

ఇదీ చదవండి: Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!

స్టాటిన్స్, ఫైబ్రేట్స్

ఈ మందులను ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే వీటివల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఈ మెడిసిన్స్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలో జోక్యం చేసుకోవచ్చు. పురుషుల్లో అంగస్తంభన సమస్యలకు ఇవి కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు నిర్ధారణకు వచ్చాయి.

బెంజోడియాజిపైన్స్-ట్రాంక్విలైజర్స్

బెంజోడియాజిపైన్స్ అనేవి మత్తుమందులు. ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. బెంజోడియాజిపైన్స్ ఫలితంగా కలిగే ఉపశమన లక్షణాలు లైంగిక ఆసక్తితో పాటు శృంగార కోరికలను ప్రభావితం చేస్తాయి. ఈ మందులు వాడేవారిలో సంభోగంలో సంతృప్తి లేకపోవడం, స్ఖలన, అంగస్తంభన సమస్యలు వంటి దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం కలిగిస్తాయి.

బీపీ మెడిసిన్

అధిక రక్తపోటుతో బాధపడేవారు శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. అయితే హై-బీపీకి చికిత్స చేసేందుకు వాడే మందులు లైంగిక సమస్యలను పెంచుతాయి. ఈ మందులు వాడే పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్యలు ఎదురుకావచ్చు. స్త్రీలలో యోని పొడిబారడం, సెక్స్ కోరికలు తగ్గడం, భావప్రాప్తి పొందడంలో ఇబ్బందులకు ఇవి కారణమవుతాయి.

యాంటీహిస్టామైన్లు (Antihistamines)

తుమ్ములు, ముక్కు కారడం వంటి అలర్జీ సంబంధిత లక్షణాలను నియంత్రించడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. ఇవి తరచుగా వాడే పురుషులు అంగస్తంభన లేదా స్ఖలన సమస్యల బారిన పడవచ్చు. మహిళల్లో యోని పొడిబారడం, ఇతర సమస్యలు కనిపించవచ్చు.

Published by:Mahesh
First published:

Tags: Drugs, Sex, Sexual harrassment, Viagra

ఉత్తమ కథలు