సన్యాసినిపై వివాదాస్పద వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పిన కేరళ ఎమ్మెల్యే

12సార్లు దాన్ని సంతోషంగా ఫీలైన వ్యక్తికి.. 13వ సారి మాత్రం అది రేప్ అనిపించిందంటూ ఓ క్రైస్తవ సన్యాసినిపై కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి సన్యాసిని వ్యభిచారిణి అనడంలో తప్పేముంది? అంటూ కామెంట్ చేశారు.

news18-telugu
Updated: September 12, 2018, 10:49 PM IST
సన్యాసినిపై వివాదాస్పద వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పిన కేరళ ఎమ్మెల్యే
కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఫైల్ ఫోటో..
  • Share this:
ఓ క్రైస్తవ సన్యాసినిని 'వ్యభిచారిణి' అంటూ కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వెనక్కి తగ్గక తప్పలేదు. వ్యభిచారిణి అని ఆమెను విమర్శించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని బుధవారం ఆయన తెలిపారు. అయితే ఆ ఒక్క పదాన్ని మాత్రమే తాను ఉపసంహరించుకుంటున్నానని.. తాను చేసిన మిగతా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని అన్నారు.

కాగా, జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ తనపై 13సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఇటీవల ఓ క్రైస్తవ సన్యాసిని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 12సార్లు దాన్ని సంతోషంగా ఫీలైన వ్యక్తికి.. 13వ సారి మాత్రం అది రేప్ అనిపించిందంటూ వ్యాఖ్యానించారు. అలాంటి సన్యాసిని వ్యభిచారిణి అనడంలో తప్పేముంది? అంటూ కామెంట్ చేశారు. మొదటిసారి అత్యాచారం జరిగినప్పుడే ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు.

తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో ఎమ్మెల్యే జార్జ్ ఎట్టకేలకు 'వ్యభిచారిణి' అన్న పదాన్ని ఉపసంహరించకోక తప్పలేదు. అయితే ఆమెను తాను ఇప్పటికీ సన్యాసిని అని అనుకోవడం లేదని.. కాకపోతే ఓ మహిళను వ్యభిచారిణి అని విమర్శించడం మాత్రం తప్పేనని ఒప్పుకున్నారు. ఆ పదాన్ని తాను వాడకుండా ఉండాల్సిందని, అందుకు క్షమాపణ చెబుతున్నాని అన్నారు. ఆ ఒక్క పదం విషయంలో తప్ప.. తాను చేసిన మిగతా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాని చెప్పుకొచ్చారు.


ఎమ్మెల్యే వ్యాఖ్యలపై #VaayaMoodalCampaign(నోరు మూసుకో) అనే హాష్ ట్యాగ్‌తో సామాజిక కార్యకర్త మహమూద్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. అది కాస్త వైరల్‌గా మారి రవీనా టాండన్ లాంటి సెలబ్రిటీలు కూడా ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. దీంతో అసలుకే మోసం వచ్చేలా ఉందనుకున్న ఎమ్మెల్యే తాను వాడిన పదాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...