• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • APOLOGIES TO ALLAH WHY THIS UTTAR PRADESH CAR DRIVER SAID SORRY TO ALLAH WHY HE SKIPS RAMZAN FASTS HERE IS INSPIRING STORY NK

Apologies to Allah: అల్లాకు క్షమాపణలు.. దీక్ష చేయలేకపోతున్నా... ఓ యువకుడి కథ

Apologies to Allah: అల్లాకు క్షమాపణలు.. దీక్ష చేయలేకపోతున్నా... ఓ యువకుడి కథ

అల్లాకు క్షమాపణలు.. దీక్ష చేయలేకపోతున్నా... ఓ యువకుడి కథ

Apologies to Allah: అతను ఎందుకు రంజాన్ ఉపవాస దీక్షను కంటిన్యూ చెయ్యలేకపోయాడు? ఏ పరిస్థితులు అతన్ని అటువైపు నడిపించాయి. దేశం మొత్తాన్నీ కదిలిస్తున్న కథ ఇది.

  • Share this:
    కరోనా కాలం. కష్టాల్లో ప్రజలు. అలాంటి వారికి నేనున్నాను అంటూ కొంత మంది సాయం అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్... ప్రయాగ్‌రాజ్ సిటీలోని సంగంకి చెందిన ఓ వ్యక్తి కథ దేశానికి ప్రేరణగా నిలుస్తోంది. అతని పేరు ఫైజుల్. మిగతా ముస్లింలలాగే... తాను కూడా పవిత్ర రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేపడుతున్నాడు. ఐతే... దాన్ని కంటిన్యూ చెయ్యలేకపోయాడు. ఇందుకు బలమైన కారణం ఉంది. తమవారిని కోల్పోతున్న వారికి అంత్యక్రియల్లో సాయం చేసేందుకు ఫైజుల్ ముందుకొచ్చాడు. అలాంటి వారికి ఉచితంగా వాహన సర్వీస్ అందిస్తున్నాడు. అంతేకాదు... ఈ కరోనా కాలంలో పేదవాళ్లకు, సాయం కోరే వాళ్లకు సాయం చేస్తున్నాడు. అనాథల అంత్యక్రియలకు స్వయంగా డబ్బు ఇచ్చి సాయపడుతున్నాడు. అలాగని ఫైజుల్ డబ్బున్నవాడేమీ కాదు. మృతదేహాలను తరలించే వాహనం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల చనిపోయిన వారి మృతదేహాలను ఉచితంగా తరలిస్తూ... పేదవారికి తోడుగా నిలుస్తున్నాడు.

    ఆస్త్రాసుయా ఏరియాలో ఉంటున్న ఫైజుల్ గత పదేళ్లుగా పేదవాళ్ల మృతదేహాలను తన కారులో ఉచితగానే తరలిస్తున్నాడు. ఇక ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉంది కదా... రోజులో ఎక్కువ సమయం వారి సేవకే కేటాయిస్తున్నాడు. ఎవరైనా కాల్ చేసి భయ్యా సాయం చెయ్యవా అని అడిగితే చాలు... వెంటనే తన వాహనంతో బయలుదేరుతున్నాడు. ఈ సేవల్లో అతను ఎవరినీ డబ్బు అడగడు. కానీ ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటున్నాడు.

    ఈ సెకండ్ వేవ్ కారణంగా... ఒకే సమయంలో ఎక్కువ మంది చనిపోతుంటే... మృతదేహాలను తరలించడానికి దేశంలోని అంబులెన్సులు సరిపోవట్లేదు. పోనీ కార్లలో తరలిద్దామంటే... వేలకు వేలు అడుగుతున్నారు. చాలా మంది పేదలు... అప్పటికే కరోనా పేషెంట్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి... ఇక అంత్యక్రియలు జరిపేందుకు కూడా డబ్బు లేని దుస్థితిలోకి జారుకుంటున్నారు. అలాంటి వారికి ఫైజుల్ తోడుగా ఉంటున్నాడు. నిజమైన కోవిడ్ వారియర్‌గా మారి... తన ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టుకొని మరీ వారికి సాయం చేస్తున్నాడు. అనాథలకు తనే స్వయంగా అంత్యక్రియలు జరుపుతున్నాడు.

    ఫైజుల్ రోజూ ఐదు సార్లు నమాజు చేస్తాడు. కానీ రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చెయ్యలేకపోతున్నాడు. "నా పనికి అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో నేను దీక్షను మానేయాల్సి వస్తోంది. ఈ విషయమై నేను అల్లాను క్షమించమని కోరుకుంటున్నాను" అని ఫైజుల్ చెప్పడం దేశ ప్రజలను కదిలించింది.

    మీకు తెలుసా... ఇలా పేదలకు సాయం చేస్తూ... ఫైజుల్ పెళ్లి కూడా చేసుకోలేదు. "అందరిలా నేనూ సంసార జీవితంలోకి వెళ్తే... నా పనికి అంతరాయం కలుగుతుంది. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు" అని ఫైజుల్ చెప్పాడు. ఫైజుల్ ఇదివరకు వేరే వారి దగ్గర పనిచేస్తూ వారి బండిలో మృతదేహాలు తరలించేవాడు. కొన్నాళ్ల కిందట బ్యాంక్ లోన్ తీసుకొని సొంతంగా వాహనం కొనుక్కున్నాడు.

    ఇది కూడా చదవండి: Horoscope today 28-4-2021: ఈ రాశుల వారికి నేడు అన్నివిధాలా చక్కగా ఉంది

    ఫైజుల్ అంటే అతని ఫ్రెండ్స్, చుట్టుపక్కల వారికి చాలా ఇష్టం. ఈ రోజుల్లో చాలా మందికి మృతదేహాలను తరలించడం కూడా కష్టమైపోతోంది. అలాంటి వారికి ఫైజుల్ ఆపదలో ఆదుకున్న వాడిలో మారుతున్నాడు. ఈ రోజుల్లో పక్కవాణ్ని ఎలా దోచుకుందామా అని చూసేవారు చాలా మంది ఉన్నారు మన సొసైటీలో. కానీ ఫైజుల్ లాంటి వారు మాత్రం ఏమీ ఆశించకుండా నిస్వార్థ సేవలు అందిస్తూ అందరి హృదయాల్లో గూడు కట్టుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: