Rising India Summit: ‘ఆప్నా టైమ్ ఆ గయా… ఇట్ ఈజ్ నౌ ఎ రైజింగ్ ఇండియా’ అని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. ఆయన న్యూస్18 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023లో(Rising India Summit) గురువారం పాల్గొన్నారు. ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. మనం అప్నా టైమ్ ఆయేగా, అప్నా టైమ్ ఆయేగా అని చెప్పి చాలా రోజులైందన్నారు. ఈ రోజు అప్నా టైమ్ ఆ గయా అని అందరి ముందు చెప్పాలని ఉందన్నారు. ఇది రైజింగ్ ఇండియా అని చెప్పారు. ఆయన ప్రసంగంలోని కీలక అంశాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
* ప్రపంచానికి ఆదర్శం
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఒకటని కేంద్ర రక్షణ మంత్రి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలో ‘ఫ్రాజిల్ 5 నుంచి ఫ్యాబులస్ 5’కి మారిందన్నారు. కోవిడ్ వంటి భారీ సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత ఇండియా మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
* ఆయుధాల తయారీలో స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యం
డిఫెన్స్ సెక్టార్ సాధించిన పురోగతి గురించి రాజ్‌నాథ్ మాట్లాడారు. మన సైన్యాలకు సంబంధించిన మందుగుండు సామగ్రిని ఇప్పుడు స్వదేశీ కంపెనీల నుంచే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ ఇండస్ట్రీ కోసం క్యాపిటల్ అక్విజిషన్‌లో కొంత భాగాన్ని రిజర్వ్ చేశామని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఈ వాటా 75 శాతానికి పెంచామని, ఇది సుమారు లక్ష కోట్ల రూపాయలని పేర్కొన్నారు. మన కోసం ఆయుధాలు, సామగ్రిని తయారు చేసుకోవడమే కాకుండా, అవసరమైనప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 7-8 సంవత్సరాల క్రితం, మొత్తం డిపాజిట్ రూ.వెయ్యి కోట్లు కూడా లేదని, ఈ ఎగుమతి ఇప్పుడు రూ.14- 15 వేల కోట్లకు పెరిగిందన్నారు.
Rising India Summit: ప్రభుత్వం,న్యాయవ్యవస్థ మధ్య వివాదం లేదు..రైజింగ్ ఇండియా సమ్మిట్ లో అమిత్ షా
* నెం.1 ఎకానమీ ఇండియా
మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ స్పేస్‌లో ఇండియా వేగంగా అభివృద్ది చెందుతోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ..‘నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీదారులలో ఇండియా ఒకటి. చౌకైన మొబైల్ డేటా సేవలను అందించడంలో ముందున్నాం. 5G మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ 6జీ సేవలపై పనిచేస్తున్నారు. సమయం కలిసొచ్చినప్పుడు ఆలోచనను భూమిపై ఏ శక్తీ ఆపలేదు. ఈ విషయం నేను ఎక్కడో చదివాను. రాబోయే కాలంలో మన భారతదేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదుగుతుంది. ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది.’ అని పేర్కొన్నారు. మనం శక్తివంతమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నామని, భారతదేశంలో 40 శాతం రియల్ టైమ్ పేమెంట్లు జరుగుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
* ఎగుమతులపై దృష్టి
ఒకప్పుడు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన దేశ రక్షణ రంగం ఇప్పుడు, ఎగుమతి చేసే స్థాయికి చేరిందని రక్షణ మంత్రి అన్నారు. సేవలు, డిఫెన్స్ PSUల కోసం అనుకూల స్వదేశీకరణ జాబితాలను జారీ చేశామని, ఇందులోని ప్రొడక్టుల ఉత్పత్తి ఇప్పుడు స్వదేశంలోనే క్రమపద్ధతిలో జరుగుతుందని, దళాలు ఇప్పటివరకు 4 జాబితాలను జారీ చేశాయని తెలిపారు.
"The dream of 'Ek Bharat, Samarth Bharat' can only be achieved when all 140 crore citizens take a pledge to do everything under their capacity to take the nation forward": Union Minister Rajnath Singh (@rajnathsingh) at #News18RisingIndia #RisingIndia #IndiasHeroes pic.twitter.com/P66hPFN6ZC
— News18 (@CNNnews18) March 30, 2023
* దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థ
భారతదేశం తన లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. రైజింగ్ ఇండియా అంటే.. మన ఆర్థిక వ్యవస్థ అన్ని ఇంజిన్‌లు దూసుకెళ్తున్నాయని అర్థమని తెలిపారు. సమాజాన్ని శక్తివంతం చేయడానికి, సమానత్వం అవసరమని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. అన్ని రకాల పనిలో ప్రజలందరికీ న్యాయమైన ప్రాతినిధ్యం ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సాయుధ దళాలలో భాగం కావడం ద్వారా మహిళలు మరింత సాధికారత పొందుతున్నారని, మహిళలు ఏ విషయంలోనైనా పురుషుల కంటే తక్కువ కాదని అన్నారు.
* ఆర్టికల్ 370 రద్దు
బలమైన రాజకీయ సంకల్పం ఫలితంగానే జమ్మూ కాశ్మీర్ ఈ రోజు ఆర్టికల్ 370 నుండి విముక్తి పొందిందని రక్షణ మంత్రి చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వెలిగించిన జమ్మూ కాశ్మీర్ సమైక్యత కుంపటి ఇప్పుడు పూర్తి వైభవంతో వెలుగుతోందన్నారు. కాశ్మీర్‌లో పరిస్థితులు చాలా వేగంగా సాధారణ స్థితికి వస్తున్నాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajnath Singh