• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • APART FROM NDA AND UPA NEW COALITION WILL FORM IN CENTRE SAYS WEST BENGAL CM MAMATA BANERJEE AK

కేంద్రంలో కొత్త కూటమి... రెండు రాష్ట్రాలే కీలకం... న్యూస్ 18 ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ

కేంద్రంలో కొత్త కూటమి... రెండు రాష్ట్రాలే కీలకం... న్యూస్ 18 ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ

మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్న బెంగాల్ ముఖ్యమంత్రి... ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని న్యూస్ 18‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్‌డీఏ, యూపీఏ కాకుండా కొత్త కూటమి పుట్టుకొచ్చే అవకాశం ఉందని అన్నారు.

  • Share this:
    సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో విపక్షాలన్నీ ఏకమవుతాయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ న్యూస్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. న్యూస్ 18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషి అడిగిన అనేక ప్రశ్నలకు మమతా బెనర్జీ సమాధానమిచ్చారు. కేంద్రంలో రాబోయేది ఫెడరల్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేసిన మమతా బెనర్జీ... ప్రతి ఒక్కరికి తమ ప్రత్యేక ఎజెండా ఉంటుందని అన్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ కలిసి దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలో నిర్ణయిస్తాయని తెలిపారు. తాను అన్ని ప్రాంతీయ పార్టీలతో తరచూ టచ్‌లో ఉన్నానని... బీజేపీ పాతతరం నేతలతోనే మాట్లాడుతున్నానని మమత అన్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం కలిసిపోయాయని ఆరోపించారు.

    కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్న బెంగాల్ ముఖ్యమంత్రి... ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని వెల్లడించారు. ఎన్‌డీఏ, యూపీఏ కాకుండా కొత్త కూటమి పుట్టుకొచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీకి మద్దతిస్తారా అనే అంశంపై మమతా నేరుగా స్పందించలేదు. ప్రధాని ఎవరనే అంశంపై ఎన్నికల తరువాతే చర్చలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీతో తన సంబంధాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయని అన్నారు. బీజేపీకి బెంగాల్‌లో గతంలో వచ్చిన రెండు సీట్లు కూడా రావని మమతా బెనర్జీ జోస్యం చెప్పారు.

    బెంగాల్‌లో బీజేపీ వలస నేతలతో రాజకీయం చేయాలనుకుంటోందని అన్నారు. బెంగాల్‌లో మొత్తం 42 స్థానాలను తృణమూల్ గెలుచుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోదీ హయాంలో దేశంలోని నిరుద్యోగం 45 ఏళ్ల పతాకస్థాయికి చేరుకుందని ఆరోపించారు. జాతీయత, ఆర్మీ అంశంపై స్పందించిన మమతా బెనర్జీ... ఆర్మీ అంటే కేవలం మోదీ మాతమ్రే కాదని అన్నారు. ఆర్మీ దేశ ప్రజలందరిదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువగా ఇబ్బందిపడ్డారు. ఒక్కోక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తామన్న బీజేపీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసా కూడా వేయలేదు. రైతులకు మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మమత విమర్శించారు.

    జాతీయ పౌర రిజిష్టర్‌ను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని అన్నారు. శారద, నారదా స్కామ్‌లు తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 2012 నుంచి దీనిపై విచారణ జరుగుతోందని... ఇప్పటివరకు సీబీఐ ఏమీ తేల్చలేకపోయిందని తెలిపారు. జన్ ధన్ యోజన పథకంలో అవినీతి జరిగిందని అన్నారు. తృణమూల్‌ పార్టీని తన తరువాత ఎవరు ముందుకు నడుస్తారనే దానిపై కూడా మమత స్పందించారు. పార్టీ నడిపేందుకు ఎంతోమంది నేతలు ఉన్నారని అన్నారు. మేనల్లుడు అభిషేక్ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడటం లేదన్న మమతా బెనర్జీ... అతడు పార్టీలో పనిచేయానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నాడని స్పష్టం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు