ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా తొలి అడుగు..అధ్యయన కమిటీ నియామకం

ఈ కమిటీ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనతో పాటు సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలు, నిర్వహణ వ్యయానికి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందచేయనుంది.

news18-telugu
Updated: June 14, 2019, 9:05 PM IST
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా తొలి అడుగు..అధ్యయన కమిటీ నియామకం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం దిశగా తొలి అడుగు పడింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంలో భాగంగా ఆరుగురు సభ్యులతో కూడిన అధ్యయన కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇక రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర రోడ్డురవాణా సంస్థ మాజీ డైరెక్టర్ సుదర్శనమ్ పాదం సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనతో పాటు విలీనంలో ఎదురయ్యే సమస్యలు-వాటి పరిష్కారం, సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలు, నిర్వహణ వ్యయానికి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందచేయనుంది.

అటు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టడం కోసం అదే జిఓ లో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో భారత పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (IREDA) మాజీ డైరెక్టర్ భక్త వత్సలం, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య, ప్రాజెక్ట్ ఫైనాన్స్ మేనేజ్‌‌మెంట్ ఎక్స్‌పర్ట్‌తో పాటు మరొకరు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే విషయంలో సాధ్యాసాధ్యాలు, సలహాలు, సూచనలను రాష్ట్ర ఆర్థిక, రవాణా మంత్రులకు నివేదిక రూపంలో అందించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను మూడు నెలల్లో సమర్పించాల్సి ఉంటుంది.


First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>