Home /News /national /

AP CONSTABLE HUMANE FACE AT CARRIED LULLED A 1 MONTH OLD CRYING BABY IN TAMILNADU ELECTIONS NGS

Andhra Pradesh: సలాం పోలీస్ భాయ్. తమిళనాడు ఎన్నికల్లో మంచి మనసు చాటుకున్న ఏపీ పోలీస్

మానవత్వం చాటుకున్న ఏపీ పోలీస్

మానవత్వం చాటుకున్న ఏపీ పోలీస్

పోలీసులు మారారా? అవును అంటున్నాయి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు.. వారిలో మానవత్వం ఉందని నిరూపిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ఎన్నికల విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ చేసిన పని.. అందరితో సలాం కొట్టించేలా చేస్తోంది.

    పోలీసులు అంటే ప్రజల్లో ఒకరమైన భయం ఉంది. చాలా వరకు పోలీసులు అంటే కర్కశంగా ఉంటారని.. అవసరం ఉన్నా లేకపోయినా లాఠీలకు పని చెబుతారాని.. అసలు మనుషులను మనుషులుగా చూడరని.. ఎప్పుడూ చిరాకుపడుతూ ఉంటారని.. ఇలా రకరకాల భయాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలాచోట్ల పోలీసులు అంటే ప్రజల్లో అలాంటి అభిప్రాయమే ఉంది. అయితే అలాంటి పోలీసుల్లోనూ మనసున్న మారాజులు ఉన్నారు. ఇటీవల మానవత్వం పరమళించిన పోలీసులు సంఖ్య పెరుగుతోంది. విధుల్లో ఉంటూనే వాళ్లు చూపిస్తున్న మానవత్వం అందరితో ప్రశంసలు అందుకునేలా చేస్తోంది.. 

    ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కొందరు పోలీసులు చేసిన పనులు వైరల్ గా మారుతున్నాయి. విధిలో ఉన్నప్పుడు కళ్లముందు జరిగిన ఘటనలకు వెంటనే స్పందిస్తున్నారు. వారిలోకూడా మానవత్వం ఉందని చాటిచెబుతున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ గా నిలుస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్రలో ఇద్దరు సీఐలు అనాథ శవాలను కొన్ని కిలోమీటర్ల మేర మోసి.. శాభాష్ పోలీసు అనిపించుకునేలా చేశారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లోనూ పోలీసుల సేవలు చాలా వరకు ప్రశంసనీయంగా నిలిచాయి. 

    తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న ఓ సంఘటన పోలీసుల్లో మానవత్వం పరిమళిస్తోంది అన్నదానికి ప్రత్యేక ఉదహరణగా నిలిచింది. ఏపీకి చెందిన ఓ కానిస్టేబుల్‌ ఎన్నికల విధుల్లో భాగంగా తమిళనాడుకు వెళ్లాల్సి వచ్చింది. అతడు పోలింగ్ బూత్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడం అతడి బాధ్యత. ఆ విధి నిర్వహణలో భాగంగా అలర్ట్ గా ఉన్నాడు. అదే సమయంలో ఓ తల్లి బాధ్యతగా ఓటేయడానికి వచ్చింది. ఆమె చేతిలో కేవలం నెల వయసున్న చిన్నారి ఉంది. అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. లైన్‌ ఎక్కువ ఉండడంతో చిన్నారి గుక్కపెట్టి మరీ ఏడ్చింది. 

    ఆ సంఘటన చూసిన ఓ కానిస్టేబుల్‌ వెంటనే చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చిన్నారిని లాలాంచి ఆడించాడు. దీంతో ఆ కన్నతల్లి సంతోషంగా ఓటు హక్కు వినియోగించుకొని వచ్చే వరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన పోలీసు కానిస్టేబుల్‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించాడు. తాను పోలీసుని అని గర్వం చూపించకుండా.. మానవత్వంలో చిన్నారిని ఆడించాడు. దీంతో ఆ తల్లి మనసు చాలా సంతోషించింది. కానిస్టేబుల్‌ చేసిన పనిని అక్కడున్న వారందరు ప్రశంసించారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇది ఒక్కటే కాదు ఇటీవల పోలీసులు చేస్తున్న సాయం అందరి ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి.  ఒకప్పుడు పోలీసులు అంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా లాక్ డౌన్ విధించిన ప్రారంభంలో పోలీసుల పనితీరుపై చాలా విమర్శలు వచ్చాయి. పోలీసులుకు కనపడితే చాలు వీపు వాచిపోతుందనే ప్రచారం జరిగింది. చాలామంది పోలీసుల లాఠీదెబ్బలు తిన్నవాళ్లు  ఉన్నారు. కానీ తరువాత తరువాత అలాంటి ఘటనలు ఎక్కడా జరగడం లేదు. అక్కడక్కడా మినహా.. చాలా వరుకు పోలీసులకు సలాం అన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: 5 State Elections, Andhra Pradesh, AP News, AP Police, Tamil nadu, Tamil Nadu Assembly Elections 2021

    తదుపరి వార్తలు