CM YS Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు జోరుగా ఉన్నాయి. ఈ టైంలో హస్తినకు పోయి రావలె అని ఆయన వెళ్లనుండటం హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి మార్చి 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రెండు వారాల గ్యాప్‌లో మళ్లీ మోదీని కలవబోతున్నారు. కచ్చితంగా ఏదో జరుగుతోంది అనే ప్రచారం మొదలైంది.
ఏపీలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదో ఒకటి తేలేలా ఉంది. ఈ అంశాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో సీఎం జగన్ చర్చిస్తారని అంచనా ఉంది. అలాగే.. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీగా ప్రలోభాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాల గిరి... తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇలాంటి సమయంలో జగన్ మోదీని కలుస్తుంటే.. హాట్ టాపిక్ అవ్వడం సహజం.
తన పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఆల్రెడీ అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయ్యింది. సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయిన సీఎం.. వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఏదో జరుగుతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది. రెండు వారాల గ్యాప్‌లోనే వెళ్తున్నారు కాబట్టి.. ఈ చర్చ మరింత పెరిగింది. దీని చుట్టూ ఇవాళ పాలిటిక్స్ నడిచే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Delhi, Narendra modi