నేడు తమిళనాడుకు చంద్రబాబు...డీఎంకేకు మద్దతుగా ప్రచారం

మధ్యాహ్నం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈవీఎంల లోపాలపై మరోసారి విమర్శలు గుప్పించనున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమతో కలిసి రావాల్సిందిగా స్టాలిన్‌ను కోరనున్నారు చంద్రబాబు.

news18-telugu
Updated: April 16, 2019, 7:17 AM IST
నేడు తమిళనాడుకు చంద్రబాబు...డీఎంకేకు మద్దతుగా ప్రచారం
చంద్రబాబు
  • Share this:
ఏపీలో పోలింగ్‌లో ముగియడంతో ఇక దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈవీఎంల పనితీరుపై విపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న ఆయన.. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేసిన చంద్రబాబు...ఇవాళ తమిళనాడులో డీఎంకేకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.

తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించే అవకాశముంది. చంద్రబాబు వెంట ఎంపీ సీఎం రమేశ్ కూడా చెన్నైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం అనంతరం మధ్యాహ్నం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈవీఎంల లోపాలపై మరోసారి విమర్శలు గుప్పించనున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమతో కలిసి రావాల్సిందిగా స్టాలిన్‌ను కోరనున్నారు చంద్రబాబు.

సోమవారం కర్నాటకలోని మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి, సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కు మద్దతుకు ఆయన ప్రచారం చేశారు. అదే స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సినీనటి సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. సుమలతకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని...నిఖిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

First published: April 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు