కేరళకు ఏపీ రూ.51 కోట్ల సాయం

వరదలతో విలవిల్లాడిన కేరళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.51 కోట్ల సాయం అందించింది.

news18-telugu
Updated: September 12, 2018, 9:36 PM IST
కేరళకు ఏపీ రూ.51 కోట్ల సాయం
కేరళ మంత్రి జయరాజన్‌కు చెక్కును అందజేస్తున్న ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
  • Share this:
ఊహించని రీతిలో వ‌ర‌ద‌ల్లో చిక్కుకోని కొట్టుమిట్ట‌టాడుతున్న కేర‌ళ‌కు ఆంద్ర‌ప్ర‌దేశ్ చేసిన సమయానికి కేరళ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. కేరళకు ఇంత పెద్ద సాయం మరే ఇతర రాష్ట్రం నుంచి అందలేదని కేరళ ప్రభుత్వం తెలిపింది. వరదల వల్ల కష్టాల్లో ఉన్న కేరళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.51 కోట్లకు పైగా సాయాన్ని కేరళకు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప ఈ చెక్కులను కేరళ ప్రభుత్వానికి అందజేశారు. త్రివేండ్రం లోని కేరళ సచివాలయంలో ఆ ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు చిన రాజప్ప ను సాదరంగా సచివాలయానికి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి విజయ్ పినరయి విదేశాలకు వెళ్లడంతో పరిశ్రమల శాఖ మంత్రి జయరాజన్ కు చెక్కులు అందజేశారు. కేరళకు కష్టకాలంలో సహాయం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్ర‌భుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేర‌ళ రుణ‌ప‌డి ఉంటుంద‌ని జయరాజన్ అన్నారు. కేర‌ళ ప్ర‌జ‌ల‌కోసం 2000 మెట్రిక్ ట‌న్నుల‌కు పైగా బియ్యాన్ని పంప‌డంతోపాటు కేర‌ళ‌కు అన్ని విధాల సాయం, తోడ్పాటు అందించిన చంద్ర‌బాబు నాయుడుకి , రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేర‌ళ ప్ర‌జ‌ల త‌రుపున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

కేర‌ళ ప్ర‌జ‌ల‌ను అన్ని విధాల ఆదుకోవ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిద్దంగా ఉంద‌ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప  తెలిపారు. కేర‌ళ‌కు ఏపీ ప్ర‌భుత్వం అందచేసిన సాయంలో రూ.35 కోట్ల నగదు కాగా, మిగిలింది సహాయ సామ‌గ్రి ఉంది. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన రూ.10 కోట్లు, ఏపీ ఎన్జీఓలు త‌మ ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.20 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.3 కోట్లు, పీఐఐసీ నుంచి రూ.17 ల‌క్ష‌ల విరాళం, ఆర్టీజీఎస్ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.8.09 ల‌క్ష‌లు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ పంపిన రూ.6 కోట్ల విలువైన 2,014 మెట్రిక్ ట‌న్నుల బియ్యం, కృష్ణా జిల్లా నుంచి పంపిన రూ.కోటి విలువైన సామ‌గ్రి, విశాఖ‌ప‌ట్నం నుంచి పంపిన రూ.10వేల దుప్ప‌ట్లు ఇత‌రత్రా స‌హాయ సామ‌గ్రి ఉన్నాయి.

First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...