ANTIQUE EMERALD SHIVA LINGAM WORTH RS 500 CRORES SEIZED FROM INDIAN BUSINESSMAN BANK LOCKER IN TAMILNADU PRV
Emerald shiva lingam: బయటపడిన రూ.500 కోట్ల విలువైన మరకత విగ్రహం... ఎక్కడ దొరికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశంలో వందలు వేల ఏళ్ల నుంచి ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయి. అప్పటి రాజులు చేయించిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. ఇటీవలె అత్యంత విలువైన, అరుదైన పురాతన మరకత శివలింగం ఒకటి ఆలయాల్లో కాకుండా మరోచోట బయటపడింది.
పురాతన వస్తువులకు విశిష్ట ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాదు విలువ కూడా ఎక్కువే. భారతదేశం సంప్రదాయాలు, ఆలయాలు, భక్తి పారవశ్యానికి ప్రతీక. వందలు వేల ఏళ్ల నుంచి ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయి. అప్పటి రాజులు చేయించిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. ఇటీవలె అత్యంత విలువైన, అరుదైన పురాతన మరకత శివలింగం (Emerald shiva lingam) ఒకటి తమిళనాడులోని తంజావూరు (Thanjavur in Tamil Nadu)లో వెలుగు చూసింది. ఈ శివలింగం (Shiva lingam) విలువ రూ. 500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ కె.జయంత్ మురళి చెన్నై (Chennai)లో వెల్లడించారు.
బిజినెస్‌మ్యాన్ ఇంట్లో..
తంజావూరులోని అరుళనంద నగర్ లో సామియపన్ అనే బిజినెస్ మ్యాన్ ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు సీఐడీ పోలీసు అధికారులు (CID Police officials) డిసెంబర్ 30న సామియపన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సామియపన్ కుమారుడు ఎన్ఎస్ అరుణ్‌ను ప్రశ్నించగా తన తండ్రి ఎన్ఏ సామియప్పన్ (80) తంజావూరులోని బ్యాంకు లాకర్ (Bank locker)లో ఓ పురాతన శివలింగాన్ని దాచిపెట్టినట్టు ఎన్ఎస్ అరుణ్ తెలిపాడు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే లింగానికి సంబంధించిన ధ్రువపత్రాలేవి నిందితుల వద్ద లేవు. దీంతో ఆ విగ్రహాన్ని (Statue) స్వాధీనం చేసుకొని.. దాని వివరాలను బయటపెట్టారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న దీనిని పురాతనమైనదిగా పోలీసులకు తెలిపాడు. ఈ శివలింగం విలువ రూ. 500 కోట్లు ఉంటుందని జెమాలజిస్టులు (Gemologists) అంచనా వేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ (ADGP) కె.జయంత్ మురళి చెన్నైలో వెల్లడించారు. అయితే తన తండ్రి సామియప్పన్‌కు ఈ శివలింగం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పారని పేర్కొన్నారు. దీంతో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు ఆర్ రాజారామ్, పి అశోక్ నటరాజన్ నేతృత్వంలోని బృందం ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
చోళుల కాలం నాటిదిగా..
శివలింగాన్ని బ్యాంకు లాకర్ నుంచి తమిళనాడు ఐడల్స్ స్మగ్లింగ్ నిరోధక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం చోళుల కాలం నాటిదిగా గుర్తించారు. ఇది వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. తంజావూరులోని అరులనంద నగర్, సెవెన్త్ క్రాస్, లంగ్వల్ హోమ్స్‌లో ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. తన తండ్రి ఎన్ఏ సామియప్పన్ (80) తంజావూరులోని బ్యాంకు లాకర్లో ఓ పురాతన మరకత (Mara Gatha) శివలింగాన్ని దాచిపెట్టినట్టు అరుణ్ చెప్పారని వెల్లడించారు. ఆ తర్వాత శివలింగాన్ని దర్యాప్తు కోసం తమకు అందజేశారని పోలీసులు తెలిపారు.
తిరుకువలై శివాలయం విగ్రహం ఇదేనా..?
2016లో నాగపట్టణంలోని తిరుకువలై శివాలయంలో దొంగతనానికి గురైనది . ఈ శివలింగమేనా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. నిందితుడు సామియప్పన్ విచారణకు సహకరిస్తున్నారని, ఈ ఘటనపై కేసు నమోదుచేశామని ఏడీజీపీ జయంత్ వివరించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.