Anil Deshmukh: మహారాష్ట్రలో మరో సంచలన పరిణామం.. మాజీ హోంమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

అనిల్ దేశ్‌ముఖ్ (ఫైల్ ఫొటో)

మహారాష్ట్రలో వంద కోట్ల వసూళ్ల టార్గెట్ ఆరోపణలు పలు సంచలన రాజకీయ పరిణామాలకు దారితీస్తోంది. ఇప్పటికే సీబీఐ విచారణ ప్రారంభమయిన నేపథ్యంలో తాజాగా మాజీ హోంమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదయింది..

  • Share this:
    మహారాష్ట్రలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజా మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణల కేసు విచారణలో మరో అడుగు ముందుకు పడినట్టయింది. నెలకు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని కొద్ది రోజుల ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఆరోపణలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    వంద కోట్ల వసూళ్ల టార్గెట్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ’ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి తగిన సమాచారాన్ని విచారణలో మేం సేకరించాం. పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తులు కూడా చాలా విలువైన సమాచారాన్ని అందించారు. దాన్ని బట్టి మేం అనిల్ దేశ్ ముఖ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది‘ అని సీబీఐ అధికారులు వెల్లడించారు.
    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

    కేసు విచారణలో భాగంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో, కొందరు ప్రముఖుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 14వ తారీఖునే మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను ఈ కేసులో భాగంగా సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఆరోపణల నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం గమనార్హం. ఈ కేసు వ్యవహారం నేపథ్యంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ సర్కారు కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష బీజేపీ విమర్శలతో ఆత్మరక్షణలో పడినట్టయింది.
    Published by:Hasaan Kandula
    First published: