ఢిల్లీ జామియా యూనివర్శిటీలో మళ్లీ కలకలం... ఫైరింగ్ చేసిందెవరు?

Jamia University : అర్థరాత్రి వేళ ఇద్దరు వ్యక్తులు ఓక్లా నుంచీ స్కూటీపై వచ్చి... జుల్లేనా వైపు వెళ్లినట్లు జామియా యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. వాళ్లెవరు?

news18-telugu
Updated: February 3, 2020, 10:08 AM IST
ఢిల్లీ జామియా యూనివర్శిటీలో మళ్లీ కలకలం... ఫైరింగ్ చేసిందెవరు?
ఢిల్లీ జామియా యూనివర్శిటీలో మళ్లీ కలకలం... ఫైరింగ్ చేసిందెవరు?
  • Share this:
Delhi : ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ దగ్గర్లో ఆదివారం రాత్రి ఫైరింగ్ ఘటన జరిగింది. ఆ సమయంలో... అండర్ గ్రాడ్యుయేట్ లా విద్యార్థి అర్షాన్ అఫాక్ ఘటనా స్థలంలో ఉన్నాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి... కాల్పులు జరిపి పరారయ్యాయి. గేట్ నంబర్ 5 దగ్గర మొదటి ఫైరింగ్ జరగగా... గేట్ నంబర్ 1 దాటిన తర్వాత రెండోసారి ఫైరింగ్ సౌండ్ వినిపించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడనప్పటికీ... పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. కొంత మంది ఆ వెహికిల్ నంబర్ తాము చూశామంటున్నారు. అర్థరాత్రి వేళ ఇద్దరు వ్యక్తులు ఓక్లా నుంచీ స్కూటీపై వచ్చి... జుల్లేనా వైపు వెళ్లినట్లు జామియా యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.

కాల్పుల ఘటన తర్వాత జామియా నగర్ SHO... తన టీమ్‌ని వెంటపెట్టుకొని స్పాట్‌కి వెళ్లారు. అక్కడ ఖాళీ బుల్లెట్ షెల్స్ ఏవీ కనిపించలేదు. కానీ... కాల్పులకు సంబంధించి రకరకాల వాదనలు వినిపించాయి. కొంతమంది వాళ్లు వచ్చిన వాహనం స్కూటర్ అంటుంటే... మరికొందరు అది కారు అంటున్నారు. దాంతో వాస్తవంగా ఏం జరిగిందన్నది పోలీసులకు కొంత అనుమానాలున్నాయి. ఈ ఘటన తర్వాత అక్కడి పోలీస్ స్టేషన్ బయట చాలా మంది విద్యార్థులు, ఇతరులూ ధర్నా చేశారు. తమ కంప్లైంట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందే చట్ట ప్రకారం ఎంక్వైరీ జరిపిస్తామని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.

ఇదే జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో జనవరి 30న తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ''ఆజాద్ కావాలా.. తీసుకోండి''... అంటూ తుపాకీని పేల్చాడు. దుండగుడి కాల్పుల్లో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి మైనర్ అని తెలిపారు. కాల్పుల్లో గాయపడిన విద్యార్థిని జమ్మూకాశ్మీర్‌లోని దొడా జిల్లాకు చెందిన షాదబ్ ఫరూఖ్‌గా గుర్తించారు. అతడి ఎడమ భుజంలో బుల్లెట్ దిగడంతో మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఎయిమ్స్‌కు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం షాదబ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ఈ ఘటనతో జమియా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. ముందుజాగ్రత్తగా జామా మసీదు, ఐటీవో, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. అంతకుముందు గత సోమవారం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... దేశద్రోహులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చాడు. ఆయన ప్రసంగం చేసిన కొన్ని గంటల్లోనే ఢిల్లీలోని షాహీన్ బాగ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్ చేశాడు. CAAకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని బెదిరించాడు. ఆ తర్వాత జనవరి 30న మైనర్ బాలుడు కాల్పులు జరిపాడు.

First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు