ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ భూకంపం..

ప్రతీకాత్మక చిత్రం

ఈ భూకంపంతో పీవోకే ప్రజలు మరోసారి వణికిపోయారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ఆస్పత్రులు రోగులను ఖాళీ చేయించాయి.

  • Share this:
    ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి భూకంపం సంభవించింది. పీవోకేలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. మీర్పూర్‌కు 4 కి.మీ దూరంలో భూమికి 12 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపంతో పీవోకే ప్రజలు మరోసారి వణికిపోయారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ఆస్పత్రులు రోగులను ఖాళీ చేయించాయి. ఆస్తి, ప్రాణ నష్టాల గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

    కాగా, మంగళవారం భారీ భూకంపం పీవోకేను అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత గల భూకంపం ధాటికి మీర్‌పూర్‌లో తీవ్ర విధ్వంసం జరిగింది. భూకంపం ధాటికి పీవోకేలో 37 మంది చనిపోగా.. 500 మందికి గాయాలయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. రోడ్లు చీలిపోవడంతో వాహనాలు పడిపోయాయి. కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. ఆ విధ్వంసం నుంచి తేరుకోకముందే తాజాగా మరోసారి భూమి కంపించడంతో పీవోకే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
    First published: