Home /News /national /

ANOTHER CHANCE FOR NEET EXAM FOR KARNATAKA STUDENTS WHIO MISSED THE TRAIN MK

రైలు ఆలస్యంతో నీట్ పరీక్ష రాయని విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ ప్రవేశ పరీక్షకు రైలు ఆలస్యంతో పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ నెల 20న వారందరికీ పరీక్ష మరోసారి నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు జవదేకర్ ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
    హంపీ ఎక్స్‌‌ప్రెస్ రైలు ఆలస్యంతో నీట్ పరీక్ష రాయలేకపోయిన సుమారు 500 మంది విద్యార్థులపై కేంద్రం కరుణించింది. నీట్ ప్రవేశ పరీక్షకు రైలు ఆలస్యంతో పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ నెల 20న వారందరికీ పరీక్ష మరోసారి నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు జవదేకర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఆదివారం నీట్ పరీక్ష సందర్భంగా హంపీ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 7.30 గంటలకు బెంగుళూరు చేరుకోవాల్సి ఉండగా, దాదాపు 6 గంటల ఆలస్యంతో అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంది. రైల్వే శాఖ వారి అలసత్వానికి సుమారు 500 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. దీంతో రాజకీయంగా సైతం దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేస్తూ విమర్శలు చేశారు. అలాగే రైలు ఆలస్యం కారణంగా విద్యార్థులు పరీక్ష మిస్ కావడం పట్ల అటు సామాజిక మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అయ్యింది. దీంతో దిగివచ్చిన కేంద్రం ఎట్టకేలకు పరీక్షను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న ఒడిశా విద్యార్థులతో పాటు పరీక్ష రాయలేకపోయిన 500 మంది విద్యార్థులకు సైతం పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.
    First published:

    Tags: Exams, NEET

    తదుపరి వార్తలు