ఇప్పటి వరకు ఫిబ్రవరి 14వ తేదిని ప్రేమికుల రోజు(Valentine's Day)గా జరుపుకుంటున్నారు. అయితే ఇకపై ఆ రోజుకు మరో ప్రత్యేకత సంతరించుకుంది. ఫిబ్రవరి 14వ తేదిని"కౌ హగ్ డే"(Cow hug day)గా ప్రకటించింది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా(Animal welfare board of india ). అంటే ఫిబ్రవరి 14వ(February 14th)తేదిన ఆవులను ప్రేమగా దగ్గరకు తీసుకొని హత్తుకొని మూగజీవాల పట్ల, పాడినిచ్చే పశువుల పట్ల ప్రేమను వ్యక్తం చేయాలని ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాన్ని తెలియజేసింది జంతు సంక్షేమ బోర్డు.ఆవులు జీవ వైవిద్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయని ..మానవాళికి అనేక అవసరాలు తీరుస్తున్న గోమాతను దైవస్వరూపంగా భావిస్తారు. కామధేనువుగా కొలిచే పశువుల పట్ల ఒక్కరోజు ప్రేమగా కౌగిలించుకోవడం వల్ల వాటిలో సానుకూల శక్తిని నింపవచ్చని కేంద్ర ప్రభుత్వంలోని మత్స్య,పశుసంవర్దక,పాడి పరిశ్రమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జంతు సంరక్షణ బోర్డు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 14 కౌ హగ్ డే..
ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్న ఫిబ్రవరి 14వ తేదీని ఇకపై కౌ హగ్ డేగా జరుపుకోవాలని యానివల్ వెల్పేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. పాశ్చ్యాత్య పోకడలతో వైదిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తున్నట్లుగా బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఇకపై ఫిబ్రవరి 14వ తేదీని కౌ హగ్ డేగా జరుపుకోవాలని ఆ రోజు పాడినిచ్చే పశువుల్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని కౌగిలించుకోవాలని పశువుల ప్రేమికుల్ని కోరింది.
సమాజ హితం కోసమే..
దీనివల్ల మాతృ ఆవు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని సంతోషంగా మరియు సానుకూల శక్తితో నింపవచ్చని అభిప్రాయపడింది.
వ్యక్తిగత, సామూహిక ఆనందం కోసమే..
ఇదేదో ప్రేమికుల రోజు(వాలెంటైన్స్ డే)కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని అభిప్రాయపడింది. ఆవులను కౌగిలించుకోవడం వల్ల వాటిలోని భావోద్వేగ సంపదతో పాటు వ్యక్తిగత మరియు సామూహిక ఆనందం పెరుగుతాయని జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కాబట్టి ఇకపై ప్రతి ఏటా జంతు, పశువుల ప్రేమికులు ఆవుల్లో సానుకూల శక్తిని పెంచడానికి సామూహిక ఆనందాన్ని ప్రోత్సహించడానికి కౌ హగ్ డేని విధిగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తమ ప్రకటన విడుదల చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Animal Lovers, Cow, National News