రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) డైరెక్టర్ పదవి నుంచి అనిల్ అంబానీ తప్పుకున్నారు. ఈ మేరకు శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనిల్ అంబానీతో పాటు విరానీ,రైనా కరణి,మంజరి కాకర్, సురేష్ రంగాచార్ అనే నలుగురు డైరెక్టర్లు కూడా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను కంపెనీలోని బీఎస్ఈ,ఎన్ఎస్ఈ పరిశీలనకు పంపినట్టు సమాచారం. భారీ నష్టాలు,అప్పులు ఆర్కామ్ను కోలుకోకుండా చేశాయి. బకాయిలు చెల్లించలేక ఆర్కామ్ తన మొబైల్ సేవలను కూడా నిలిపివేసింది. ఇలాంటి పరిస్థితుల్లోఆర్కామ్ దివాలా తీసే పరిస్థితులకు చేరువైంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో లైసెన్స్ ఫీజులు,స్పెక్ట్రమ్ బకాయిల కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు
రూ.30,142కోట్లకు చేరుకున్నాయి.
ఇది కూడా చూడండి :
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.