Woman Anger : తనకు తెలియకుండ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహిళ.. చుక్కలు చూపించింది..!

Woman Anger : తనకు తెలియకుండ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహిళ.

Woman Anger : తన అనుమతి లేకుండా ఇంటిపైకి ఎక్కిన ఇద్దరు పనివారికి చుక్కలు చూపించింది ఓ మహిళ.. తాడు సహాయంతో ఇంటిపై వేళాడుతున్న వారిని వేలాడేలా చేసింది. అది కూడా 26 అంతస్తుల భవనం నుండి కావడంతో ఆమెపై హత్యయత్నం కేసు నమోదు అయింది.

 • Share this:
  మనిషికి కోపం ( angry) వస్తే ఏం చేస్తారో అర్థం కాదు.. కాని అది ఒక్కోసారి మనిషి ప్రాణాలు కూడా తీసే పరిస్థితి వరకు తీసుకువస్తుంది. తనకు నచ్చని పని చేసినప్పుడు అవతలి వారిపై ఎలాగైనా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వచ్చే కోపానికి హద్దు అదుపు ఉండదు.. ఆ సందర్భంలో తాము ఏం చేస్తున్నామో కూడా విచక్షణ కోల్పోయో ప్రమాదం ఉంటుంది. అదే సంధర్భంలో మనిషి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడని పరిస్థతి కనిపిస్తుంది. అలాంటి సందర్భమే ఒకటి విదేశాల్లో కనిపించింది. అది కూడా ఓ మహిళలకు కోపం వస్తే ఏం చేసిందో తెలిస్తే అశ్చర్యపోవాల్సిన పరిస్థతి తీసుకువచ్చింది.

  సాధారణంగా అయితే మనకి కోపం వస్తే.. గట్టిగా అరుస్తాం.. లేదా చేతిలో ఉన్న వాటిని విసిరేస్తాం కాని ఓ మహిళ మాత్రం అవతలి వ్యక్తి ప్రాణాలు తీసే పనికి పూనుకుంది. తీరా పోలీసులు వచ్చే సరికి తాను కావాలని చేయలేదని చేతుతెత్తెసింది. వివరాల్లోకి వెళితే.. థాయ్‌ల్యాండ్‌ లో ఓ మహిళ ఆగ్రహం.. ఆమెకు జైలు జీవితాన్ని.. ఇద్దరు వ్యక్తులకు బతికుండగానే చావును పరిచయం చేసింది. ఆ మహిళ ఏకంగా ఇద్దరు వ్యక్తులను 26వ అంతస్తు నుంచి కిందకు వేలాడేలా చేసింది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని హెచ్చరిస్తోంది.

  ఇది చదవండి : విచిత్రం.. తల్లిదండ్రులకు తెలియకుండా గర్భం మెయింటెన్ చేసింది. చివరకు యూట్యూబ్ చూస్తూ..


  ఈ సంఘటన ఉత్తర బ్యాంకాక్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో సదరు మహిళ నివసిస్తూ ఉంది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఓ చోట రిపేర్‌ రావడంతో ఇద్దరు పెయింటర్లు 26వ అంతస్తుకు వెళ్లి.. రిపేరు చేయడం ప్రారంభించారు.అయితే ఇది చూసిన ఆ మహిళకు కోపం నశాలానికి ఎక్కింది. తన అనుమతి లేకుండా తన బిల్డింగ్ పైకి ఎలా వెళతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే వారు బిల్డింగ్ పై నుండి కట్టుకున్న తాడును వెంటనే కత్తిరించింది. వారు కిందనుండి అరుస్తుండగానే ఉన్న తాడును కోసేసింది. దీంతో చూస్తున్న రిపేర్లకు మైండ్ బ్లాక్ అయింది. పాపం వారిద్దరు 26వ అంతస్తు నుంచి గాల్లో వేలాడసాగారు. ఇది గమనించిన ఇతర సిబ్బంది వచ్చి.. వారిని కాపాడేవరకు గాల్లోనే ఉన్నారు.

  ఇది చదవండి : నగర మంత్రికి, ఎమ్మెల్యేకు జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లేక్సీలకు ఫైన్


  దీంతో ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియా ( socila media ) లో తెగ వైరలయ్యింది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం తాడు కట్ చేసిన మహిళను అరెస్ట్‌ ( arrest ) చేశారు. అయితే తాను వారిని చంపాలనుకోలేదని.. తన అనుమతి లేకుండా బిల్డింగ్‌కు మీదకు ఎక్కడంతో కోపం వచ్చి.. తాడు కట్‌ చేశానని తెలిపింది. ఏది ఏమైనా సదరు మహిళ చేసిన పని హత్యాయత్నం కిందకే వస్తుందని చెప్పి.. ఆమె మీద కేసు నమోదు చేశారు.
  Published by:yveerash yveerash
  First published: