హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Cycle Yatra: సైకిల్‌పై భారతదేశ యాత్ర.. ఈ తెలుగు యువకుడి సందేశమిదే..!

Cycle Yatra: సైకిల్‌పై భారతదేశ యాత్ర.. ఈ తెలుగు యువకుడి సందేశమిదే..!

రాము సైకిల్ యాత్ర

రాము సైకిల్ యాత్ర

Cycle Yatra: చెట్లు, నీటిని సంరక్షించాలి.. జాతీయ పతకాన్ని గౌరవించాలి అనే నినాదంతో తాను భారత దేశ పర్యటన చేస్తున్నట్లు చెప్పాడు రాము. ప్రతి రోజూ 12 గంటల పాటు సైక్లింగ్ చేస్తాడు. దాదాపు 200 కి.మీ. ప్రయాణిస్తాడు.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో ట్రావెలింగ్ (Traveling)  చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు సైకిల్‌పై వెళ్తే..మరికొందరు బైక్‌లకు సవారీ చేస్తారు. కొత్త ప్రాంతాలను తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మానసికోల్లాసం పొందుతారు. అంతేకాదు పలువురు ట్రావెలింగ్‌నే వృత్తిగా ఎంచుకుంటున్నారు. ట్రిప్‌ను వ్లాగ్‌గా మలిచి.. యూట్యూబ్ ఛానెల్స్ నడుపుతున్నారు. తద్వారా ఆదాయం పొందుతున్నారు. ఐతే కొంత మంది మాత్రం.. ఒక దృఢ సంకల్పంతో... ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో యాత్రలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు చెందిన రాము ఈ కోవలోకే వస్తాడు. రాము సైకిల్‌పై భారత దేశ యాత్ర (Cycle Yatra) చేస్తున్నాడు. ఏదో కొత్త ప్రాంతాలు చూడాలనే ఉద్దేశంతో అతడు యాత్ర చేయడం లేదు. 'సేవ్ ట్రీ, సేవ్ వాటర్, రెస్పెక్ట్ ఇండియన్ ఫ్లాగ్’ అనే సందేశమిస్తూ...  దేశమంతా సైకిల్‌పై తిరుగుతున్నాడు.

మూడు నెలల క్రితం ఏపీ నుంచి బయలుదేరిన రాము.. ఇప్పుడు బీహార్‌లోని బోధ్ గయకు చేరుకున్నాడు. ఇప్పటి వరకు 14 రాష్ట్రాల మీదుగా.. 15వేల కిలోమీటర్లు తిరిగాడు. బుధవారం బోధ్ గయాలోని మహాబోధి ఆలయాన్ని సందర్శించాడు. బీహార్ తర్వాత జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాము. సైకిల్ యాత్ర చేస్తూ..పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. చెట్లను నరకవద్దని.. నీటిని వృథా చేయవద్దని.. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాడు రాము.

Shiv Temple: ఈ ఆలయంలో జీన్స్, టీషర్ట్స్, స్కర్ట్స్ నిషేధం.. అప్పుడే శివయ్య దర్శనం

డోరాత్రి పూట ధాబా లేదా అతిథి గృహాల్లో విశ్రాంతి తీసుకుంటాడు. నాలుగు సంవత్సరాలుగా పాకెట్ మనీని సేవ్ చేశానని.. మొత్తం లక్షన్నర రూపాయలు అయ్యాయని చెప్పాడు. ఆ డబ్బుతోనే ఇప్పుడు సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపాడు. తాను చేపట్టిన ఈ యాత్రకు కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం కూడా ఉందని వెల్లడించాడు.

''వాతావరణ మార్పు అనేది ప్రపంచంలోని అతిపెద్ద సమస్య. దీనికి పరిష్కార మార్గాలను వెతికేందుకు పెద్ద పెద్ద దేశాలు కూడా కష్టపడుతున్నాయి. వాతావరణ మార్పులను సత్వరమే నియంత్రించకుంటే రాబోయే కొన్నేళ్లలో భూమి నాశనమవుతుంది. హిమానీనదాలు చాలా వేగంతో కరిగిపోతున్నాయి. 2050 నాటికి భారతదేశంలోని సముద్ర తీరంలో ఉన్న పెద్ద నగరాలు సముద్రంలో మునిగిపోతాయని ఒక సర్వే తెలిపింది. వాతావరణ మార్పుల నివారణకు అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అందుకే నేను కూడా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు తెలియజేస్తున్నా.'' అని న్యూస్18కి తెలిపారు రాము.

First published:

Tags: Andhra Pradesh, Bihar, Local News

ఉత్తమ కథలు