ఏపీలో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చింది. రోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,045 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 6,494 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 65 మంది మరణించారు. Full Story
ఏపీలో కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. Full Story
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. Full Story
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాన్నివెంటనే ఖాళీ చేసి సీల్ వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డిఎంఇ) డాక్టర్ కె. రమేష్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు పాత భవనంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని అధికారులు ఆదేశించారు.
గత నెలలో భారత్-చైనా సైన్యం ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ కుటుంబం బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసింది. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ నియామక పత్రాన్నిఅందజేశారు సీఎం. Full Story
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్‌గిరి తెలిపారు. Full story
రాజ్యాంగ సంక్షోభం దిశగా రాజస్థాన్ వెళ్తున్నట్లు స్పీకర్ సీపీ జోషీ ఆరోపించారు. తాను రెబల్ ఎమ్మెల్యేలకు కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ అంశంలో సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ ఫైల్ చేయాలని తమ అధికారులకు తెలిపిట్లు స్పీకర్ వెల్లడించారు. మరోవైపు దీనిపై సచిన్ పైలెట్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.
బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్నాయి. బంగారం 10 గ్రాములు రూ.50వేలు, వెండి కేజీ రూ.60వేలు దాటాయి. Full story
ఇంటర్నెట్ తక్కువ వాడేవారికి, ఎక్కువ వాడేవారికి వేర్వేరు ప్లాన్స్ అందిస్తుంటాయి టెలికాం సంస్థలు. మరి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రోజూ 1.5 జీబీ డేటాతో అందించే ప్లాన్స్ ఇవే. Full Story
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.