ఒడిశా తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ రూ.15కోట్లు విరాళం

‘ఫణి తుపాన్ తో ఒడిశా కకావికలం అయ్యింది. దేశంలో అన్నిరాష్ట్రాలు ఒడిశా తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి. అందరూ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించాలి.’ అని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: May 5, 2019, 9:37 PM IST
ఒడిశా తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ రూ.15కోట్లు విరాళం
ఫొణి తుఫానుతో కకావికలమైన పూరీ
  • Share this:
ఫణి తుఫాన్ ప్రభావంతో అతలాకుతలం అయిన ఒడిశాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం అందించింది. ఏపీ ప్రభుత్వం తరఫున రూ.15 కోట్ల సాయం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంఓ అధికారులతో చర్చించారు. అనంతరం ఆర్థికసాయంపై ప్రకటన చేశారు. ఫణి తుఫాన్ ప్రభావంతో ఒడిశా కకావికలమైందని, అందరూ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఫణి తుపాన్ తో ఒడిశా కకావికలం అయ్యింది. విపత్తుల వల్ల కలిగే నష్టం తీవ్రత అపారం. ఆంధ్రప్రదేశ్ లో తరచూ విపత్తుల వల్ల నష్టం తెలిసిందే. తుఫాన్ బాధితులను ఆదుకోవడం మానవాతా ధర్మం. దేశంలో అన్నిరాష్ట్రాలు ఒడిశా తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి. అందరూ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించాలి. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. ఒడిశా ప్రభుత్వానికి కావాల్సిన అన్నివిధాలా సాయం అందిస్తాం. జాతీయ రహదారిపై చెట్ల తొలగింపు యుద్ధప్రాతిపదికన చేయాలి. విద్యుత్ రంపాలు, సిబ్బందిని ఇప్పటికే అక్కడికి పంపాం. ఆస్తినష్టం, పంటనష్టం అపారంగా జరిగింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆదుకోవాలి. తాగునీరు, ఆహారం, పాలు, కూరగాయలు సరఫరా చేయాలి. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలి.’ అని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

ఫణి తుఫాన్ ప్రభావంతో ఒడిశా అత్యంత ఎక్కువగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోనూ కొంచెం ప్రభావం చూపింది. అయితే, ఒడిశాలో ఎక్కువ నష్టం జరిగింది. ఈ క్రమంలో కేంద్రం సహాయక చర్యల కోసం రూ.1086 కోట్లు విడుదల చేసింది. అందులో ఒడిశాకు రూ.340.87 కోట్లు, తమిళనాడు (రూ.309.37 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ.235.50  కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.200.25 కోట్లు) కేటాయించారు. ఫణితుఫాన్ వల్ల ఉత్తరాంధ్రలోని 733 గ్రామాల్లో నష్టం వాటిల్లిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తెలిపారు. సుమారు రూ.10కోట్ల నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేశామన్నారు.
First published: May 5, 2019, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading