ఆహా.. ఆనంద్ మహీంద్ర జోక్ అదరహో.. భార్యకు ఆ ఫోటో పంపించి..

ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ పోస్టుకు 18వేల పైచిలుకు లైక్స్ వచ్చాయి. అలాంటి ఫోటో పంపించాక.. ఇంకా మీ భార్య మిమ్మల్ని వంట చేయమని ఎప్పటికీ అడగదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

news18-telugu
Updated: July 29, 2019, 1:04 PM IST
ఆహా.. ఆనంద్ మహీంద్ర జోక్ అదరహో.. భార్యకు ఆ ఫోటో పంపించి..
ఆనంద్ మహీంద్రా
  • Share this:
ఎవరైనా మీకు ఇష్టం లేని పని చెబితే ఏం చేస్తారు..? మీరేం చేస్తారో తెలియదు గానీ..బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రను అడిగితే మాత్రం దీనికి సరైన సమాధానం చెబుతారు. తాజాగా మహీంద్ర భార్యకు,మహీంద్రకు మధ్య జరిగిన సరదా సంభాషణే ఇందుకు మంచి ఉదాహరణ. ఇంతకీ ఏంటా సంభాషణ అంటే.. ఇటీవల ఓరోజు ఆనంద్ మహీంద్ర సతీమణి ఆయన్ను వంట చేయాలని కోరిందట. దానికి ఆయనేమీ బదులివ్వకుండా ఆమె సెల్‌ఫోన్‌కి ఒక ఫోటో పంపించారట. అంతే.. ఆ ఫోటో చూశాక ఇక ఆయనతో వంట చేయించాలన్న కోరికకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టి ఉంటుంది. అంతలా ఆ ఫోటోలో ఏముందంటే.. ఇస్త్రీ పెట్టెతోనూ చపాతీలు కాల్చవచ్చని నిరూపించిన ఓ మగ మహానుభావుడి ఫోటో అది. తాను వంట చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఆనంద్ మహీంద్ర.. ఇలా సింపుల్‌గా ఓ ఫోటో పంపించేశారన్నమాట.ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ పోస్టుకు 18వేల పైచిలుకు లైక్స్ వచ్చాయి. అలాంటి ఫోటో పంపించాక.. ఇంకా మీ భార్య మిమ్మల్ని వంట చేయమని ఎప్పటికీ అడగదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.


ఓ వర్షకాలపు వీకెండ్‌లో.. మేము ఇంటి వద్ద ఉన్న సమయంలో.. నా భార్య నన్ను వంట చేయాలని కోరింది. దానికి నేను ఓ ఫోటో పంపించి.. నేను వంట చేస్తే ఇలా ఉంటుందని చెప్పాను. అప్పుడు అడిగాను.. నా స్కిల్స్ ఏమైనా వంటకు ఉపయోగపడుతాయా..? అని.. ఆనంద్ మహీంద్ర,మహీంద్ర గ్రూప్ ఛైర్మన్

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు