Anand mahindra : ఈ వీడియో చూస్తే...చాలు... ఆనంద్ మహింద్రా ట్వీట్ వైరల్...

ఆనంద్ మహింద్ర

Anand mahindra : నిత్యం సోషల్ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా తాజాగా షేర్ చేసిన ఒలంపిక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.. ముఖ్యంగా వ్యాయామం చేసే వారికి ఈ వీడియో ఉత్సాహాన్ని ఇస్తుంది అంటూ పేర్కొన్నారు..

  • Share this:
    నిత్యం సోషల్ మీడియాలో ఉత్సహాపూరితమైన విషయాలను షేర్ చేయడంతో మహింద్ర అండ్ మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర ఎప్పుడు ముందుంటాడు.. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ఒలంపిక్ జరుగుతున్న సంధర్భంగా జిమ్నాస్టిక్ వీడియో ను షేర్ చేశాడు. అనంతరం ఆ వీడియోకు ఓ సందేశాన్ని జోడించాడు...ముఖ్యంగా ఈ వీడియో వ్యాయామం చేసేందుకు బద్దకించే వారికి చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు..మరోవైపు తాను కూడా ఈ కోవకే చెందుతానని పేర్కొన్నారు.





    వీడియోతోపాటు.. ఆదివారం నాడు వ్యాయామం చేసేందుకు నీరసంగా, బద్దకంగా ఉండేవాళ్లకు ఈ వీడియో పరిష్కారం చూపుతుందంటూ పేర్కోన్నారు. ఉత్సహాం కోసం జమ్నాస్టిక్ వీడియోను సేవ్ చేసుకోవాలని సూచించారు. సేవ్ చేసుకోవడంతోపాటు రోజుకు రెండు సార్లు చూస్తే శరీరంలోని ప్రతి కండరానికి కూడా వ్యాయామం చేసిన ఫిలింగ్ కల్గుతుందని చెప్పారు..



    మరోవైపు పీవీ సింధుపై ఓ మంచి ఇన్సిపిరేషన్ కల్గించే సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఒకవేళ ఒలంపిక్స్‌లో మానసిక క్రిడలకు సంబంధించి ఉంటే మాత్రం పీవి సింధు ఎప్పుడు ముందు ఉంటుందని పేర్కోన్నారు.
    Published by:yveerash yveerash
    First published: