Home /News /national /

AN OLD WOMAN WAS KILLED WHEN AN AMBULANCE GOT STUCK IN A TRAFFIC JAM IN JHARKHAND SNR

Jharkhand:అంబులెన్స్‌కి దారివ్వనందుకు ఎంత ఘోరం జరిగిందో తెలుసా..!

Jharkhand:

Jharkhand:

Jharkhand: అత్యంత విషమ పరిస్థితుల్లో ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్ వాహనంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ట్రాఫిక్‌ జామ్‌లో వాహనం చిక్కుకుపోవడంతో టైమ్‌కి ఆసుపత్రికి చేర్చలేకపోయారు బంధువులు. ఫలితంగా ప్రాణాలతో తీసుకెళ్లిన ఆమెను శవంగా వెనక్కి తీసుకొచ్చిన ఘటన జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇదంతా రోడ్డుపై వెళ్తున్న వారి నిర్లక్యం వల్లే జరిగిందని బాధితుడు వాపోయాడు.

ఇంకా చదవండి ...
అంబులెన్స్ వస్తుందంటే చాలు ఎంత రద్దీ మార్గంలోనైనా దారి ఇస్తాం. కానీ అక్కడి వాళ్లు మాత్రం అలా చేయలేదు. అంబులెన్స్‌కి దారివ్వకపోగా..అందులో ఉన్న పేషెంట్ (Patient)పరిస్థితిని ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఇంతటి హృదయ విదారకమైన సంఘటన జార్ఖండ్‌(Jharkhand)లో జరిగింది. అనారోగ్యంతో చావు, బతుకుల మధ్య ఉన్న ఓ వృద్ధురాల్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రి(Hospital)కి తీసుకెళ్తేందుకు భర్త అంబులెన్స్‌ (Ambulance)మాట్లాడుకున్నాడు.ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో ట్రాఫిక్ (Traffic jam)జామ్‌ అయింది. వృద్ధురాలిని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి కాస్త దారివ్వమని ఆ వృద్ధుడు రోడ్డుపై వెళ్తున్న వాళ్లను ఎంతో బ్రతిమిలాడాడు. కానీ ఎవరూ అతని అభ్యర్ధనను వినిపించుకోలేదు. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. దీంతో రోడ్డుపైనే అంబులెన్స్‌ (Ambulance)చాలా సేపు నిలిచిపోవడంతో లోపలున్న వృద్ధురాలు చనిపోయింది. ప్రాణాలతో బతికి ఉందనుకొని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు చెప్పాల్సిన చెడు వార్త చెవిలో పడేశారు. జార్ఖాండ్‌లోని ఝరియా(Jharia)కి చెందిన గయ ప్రసాద్‌చౌదరి (Gaya prasad choudhary)భార్య అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమించక ముందే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు ప్రసాద్‌చౌదరి. అంబులెన్స్‌లో ఎక్కిచుకొని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చూశాడు. కానీ ఇంతలోనే ట్రాఫిక్ జామ్‌ రూపంలో విధి అతడ్ని ఒంటరి వాడ్ని చేసింది.

ప్రాణం తీసిన ట్రాఫిక్‌ జామ్‌...
అంబులెన్స్‌ అంటేనే ప్రాణపాయస్థితిలో ఉన్నవాళ్లను ఆసుపత్రులకు చేర్చే వాహనం. కనీసం ఈ మాత్రం ఇంగితజ్ఞానం లేకుండా అక్కడి స్థానికులు ప్రవర్తించారని అంబులెన్స్ డ్రైవర్‌ సూరజ్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. దారివ్వమని అడిగితే తనతో గొడవ పడ్డారని చెప్పాడు. చివరకు క్లిష్ట పరిస్థితుల్లో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు వృద్ధురాలు చనిపోయిన విషయాన్ని నిర్ధారించారని చెప్పాడు. ఆసుపత్రికి తెచ్చే మార్గం మధ్యంలోనే ప్రాణాలు పోయాయని చెప్పడంతో గయ ప్రసాద్‌చౌదరి బోరున విలపించాడు. కాస్త దారిచ్చి ఉంటే తన భార్య బతికి ఉండేదన్నాడు. ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే కూడా ఇలాగే వ్యవహరిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

కాస్త దారిస్తే మీ సొమ్మేమైనా పోతుందా..
పనులు, అవసరాల పేరుతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదాచారులు అంబులెన్స్‌కి దారివ్వకపోవడం వల్లే ఇంతటి దారుణం జరిగింది. ఎవరికైనా సహాయం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చూసి కామెంట్స్, లైక్‌లతో సపోర్ట్ చేసే వాళ్లను ఆదర్శగా తీసుకొనైనా అంబులెన్స్‌లకు దారిచ్చి మానవత్వాన్ని చాటుకోవాలని గయప్రసాద్‌చౌదరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దారివ్వడం వల్లే నిండు ప్రాణం నిలబడటమే కాకుండా వారి కుటుంబ సభ్యులను శోకానికి గురి కాకుండా చేస్తాయని వేడుకున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Ambulence, Died, Jharkhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు