హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian in Pakistan: ఇండియాకు చెందిన మానసిక రోగిని 30 ఏళ్ల పాటు బంధించిన పాక్.. సొంతగూటికి ఎలా చేరాడంటే

Indian in Pakistan: ఇండియాకు చెందిన మానసిక రోగిని 30 ఏళ్ల పాటు బంధించిన పాక్.. సొంతగూటికి ఎలా చేరాడంటే

మానసిక రోగి అని చూడకుండా 30 ఏళ్ల పాటు బంధించిన పాకిస్తాన్ ఆర్మీ (PC: Twitter)

మానసిక రోగి అని చూడకుండా 30 ఏళ్ల పాటు బంధించిన పాకిస్తాన్ ఆర్మీ (PC: Twitter)

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు. పొరపాటున పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లాడు. దీంతో పాకిస్తాన్ సైన్యం అతడిని బంధించింది.

30 ఏళ్ల క్రితం దారి తప్పి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (POK) ప్రవేశించిన మధ్యప్రదేశ్ (Madhyapradesh) వాసిని.. పాకిస్తాన్ (Pakistan) తాజాగా విడిచిపెట్టింది. పీఓకేలో సంచరిస్తుండగా ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని బంధించారు పాక్ భద్రతా దళాలు. అతన్ని ఇన్నేళ్లు రావల్పిండి సెంట్రల్ జైలులో వేశారు. అయితే అతడు మానసిక రోగి (Mentally Disabled) అని గుర్తించిన అక్కడి అధికారులు.. ప్రహ్లాద్‌ను తాజాగా వాఘా బోర్డర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు. పొరపాటున పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లాడు. దీంతో పాకిస్థాన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మానసిక రోగి అని కూడా కనికరం చూపించకుండా అతన్ని అత్యంత కిరాతకంగా హింసించారు. దాంతో ఇప్పుడు ప్రహ్లాద్ మాట్లాడే శక్తిని కూడా కోల్పోయాడు. అయితే అత్యంత ఘోరంగా చిత్రవధకు గురిచేసిన తర్వాత సోమవారం పాకిస్థాన్ రేంజర్స్.. ప్రహ్లాద్(58)ను వాఘా బోర్డర్‌లో బిఎస్‌ఎఫ్‌ జవాన్లకు అప్పగించారు. ప్రహ్లాద్ తో పాటు మరొక ఇండియన్ ని కూడా అప్పజెప్పారు.

ప్రహ్లాద్ మానసిక స్థితిని పట్టించుకోకుండా పాకిస్థాన్ వారు హింసించారని భారత అధికారులు చెబుతున్నారు. ఘోషి పట్టి గ్రామంలోని తన ఇంటికి ప్రహ్లాద్ ఎట్టకేలకు చేరుకున్నారు. 28 ఏళ్ల తన సోదరుడు హఠాత్తుగా మాయం కావడంతో అతడి ఆచూకీ కోసం వీర్ సింగ్ విశ్వ ప్రయత్నం చేశాడు. తన సోదరుడు పాకిస్తాన్ జైలులో ఉన్నాడని 2014లో తెలుసుకుని తనని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అయితే పోలీసుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న వీర్ సింగ్ సోదరుడు పాకిస్థాన్ కి ఎలా వెళ్లాలో తమకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. పోలీసు అధికారులు మాత్రం ప్రహ్లాద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు తరలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రహ్లాద్ కు పాకిస్థాన్ అధికారులు విధించిన జైలు శిక్ష ఎప్పుడో పూర్తయింది. కానీ అతను తన కుటుంబ సభ్యుల వివరాలను తెలపలేకపోవడంతో అతన్ని ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వానికి చాలా సమయం పట్టింది. 28 ఏళ్ల పాటు పాకిస్తాన్ జైలులోనే గడిపిన ప్రహ్లాద్ కి ఇప్పుడు తన తల్లితో పాటు ఒక సోదరుడు కూడా లేరనే విషయం తెలియదు. ప్రహ్లాద్ కు ఇప్పుడు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. 1991 నుంచి ప్రహ్లాద్ కనిపించకుండా పోయాడని ఎస్పీ అతుల్ సింగ్ వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే అతని ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

First published:

Tags: India pakistan border, Pakistan army

ఉత్తమ కథలు