• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • AN EARTHQUAKE OF MAGNITUDE 2 ON THE RICHER SCALE NORTH OF MUMBAI MAHARASHTRA SK

Mumbai Earthquake: ముంబై తీరంలో భూప్రకంపనలు..

ప్రతీకాత్మక చిత్రం

శుక్రవారం ఉదయం 10.33 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ వెల్లడించింది.

  • Share this:
    దేశ ఆర్థిక రాజధాని ముంబైని భూప్రకంపనలు వణికించాయి. ముంబైకి ఉత్తరదిశన 91 కి.మీ. దూరంలో.. భూమికి 10 కి.మీ. లోతులో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.8గా నమోదయింది. శుక్రవారం ఉదయం 10.33 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ వెల్లడించింది. ఐతే దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూప్రకంపనలు వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదని వెల్లడించారు.

    చాలా తక్కువ తీవ్రతతో మాత్రం భూమి కంపించిందని.. దీనిపై ముంబై వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: