యాసిడ్ బాధితులకు అండగా నిలిచిన అమృత ఫడ్నవీస్...

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్యగా కంటే... అమృత ఫడ్నవీస్‌గా ఆమె అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మహిళలకు స్ఫూర్తినిస్తున్నారు.

news18-telugu
Updated: January 10, 2020, 9:59 AM IST
యాసిడ్ బాధితులకు అండగా నిలిచిన అమృత ఫడ్నవీస్...
అమృతా ఫడ్నవీస్ (credit - insta - amruta.fadnavis)
  • Share this:
అందం అంటే ఏంటి?... చక్కటి కళ్లు... చూడ చక్కని మోము... సన్నజాజి లాంటి శరీరాకృతి... ఇవి కాదు... నిజమైన అందం అంటే... నిర్మలమైన మనసు... గుండె నిండా ధైర్యం... అవే మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి అంటూ... యాసిడ్ దాడి బాధితుల్లో ధైర్యం, స్థైర్యాన్ని నింపారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. అలంకృత్ ఆర్ట్ ఫౌండేషన్... గిఫ్టింగ్ స్మైల్స్ పేరుతో... యాసిడ్ దాడి బాధితుల కోసం నిధుల సేకరణ చేపట్టగా... ఆ కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్ పాల్గొన్నారు. రకరకాల కారణాల వల్ల యాసిడ్ దాడుల్లో బాధితులుగా మారిన వారిపై జాలి చూపించకుండా... వారిలో ధైర్యాన్ని తట్టిలేపి... ఉన్నత స్థానాలకు చేరుకునేలా మనందరం సహకరించాలని ఆమె కోరారు. ఓవైపు బాలీవుడ్‌లో దీపికా పదుకొణె... చపాక్ సినిమాతో... యాసిడ్ దాడి బాధితురాలి జీవితాన్ని తెరకెక్కించిన సమయంలో... అమృత ఫడ్నవీస్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం యాసిడ్ దాడి బాధితుల్లో కొత్త ఉత్సాహం కలిగించింది. 

View this post on Instagram
 

‪#Felicitated & motivated Acid Attack Victors at Charity fundraiser-Gifting Smiles-by AakritiArt Foundation! Demon tries to break & disfigure her but she makes the world realise that its not the strength of body or beauty of skin but the strength of spirit & beauty of soul which keeps her going & make her what she is 💪‬ ! #acidattacksurvivors #acidattack


A post shared by Amruta Fadnavis (@amruta.fadnavis) on

అమృత ఫడ్నవీస్ ఓ బ్యాంకర్, ఓ సింగర్, ఓ సామాజికవేత్త. ప్రస్తుతం ఆమె యాక్సిస్ బ్యాంక్ (వెస్ట్ ఇండియా) కార్పొరేట్ హెడ్‌గా ఉంటూ... ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె... ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.
First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు