మోదీపై అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. సోషల్ మీడియాలో విమర్శలు..

'దేశ పురోగతి కోసం అవిరామంగా కష్టపడుతూ మాకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఫాదర్ ఆఫ్ కంట్రీ నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు.' అంటూ అమృత ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 18, 2019, 12:50 PM IST
మోదీపై అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. సోషల్ మీడియాలో విమర్శలు..
'దేశ పురోగతి కోసం అవిరామంగా కష్టపడుతూ మాకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఫాదర్ ఆఫ్ కంట్రీ నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు.' అంటూ అమృత ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
  • Share this:
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమృత ఫడ్నవీస్.. ఆయన్ను 'ఫాదర్ ఆఫ్ కంట్రీ' అని సంబోంధించడం వివాదాస్పదంగా మారింది.'దేశ పురోగతి కోసం అవిరామంగా కష్టపడుతూ మాకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఫాదర్ ఆఫ్ కంట్రీ నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు.' అంటూ అమృత ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

అమృత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. 'మోదీ దేశానికి ఫాదర్ ఎప్పుడయ్యారు..? దేశ పురోగతి కోసం ఆయన చేసిందేంటి.. ఓవైపు నిరుద్యోగం,మరోవైపు ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నాయి.' అంటూ ఓ నెటిజెన్ మండిపడ్డాడు.' ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మాగాంధీ అని తెలుసు..ఇప్పుడు కొత్తగా ఫాదర్ ఆఫ్ కంట్రీ కూడా వచ్చిందా..?' అని మరో నెటిజెన్ ప్రశ్నించాడు.ఇదిలా ఉంటే, గతంలో అమృత సెల్ఫీ వివాదంలోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే.సముద్రంలో క్రూయిజ్ షిప్ అంచున కూర్చుని ఆమె దిగిన సెల్ఫీ విమర్శలు కొని తెచ్చుకుంది.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading