జనాలు కాదు..ప్రయాణికుల భద్రతే నాకు ముఖ్యం: లోకో పైలెట్

ప్రమాదంపై లోకో పైలెట్ (రైలు డ్రైవర్) ఇచ్చిన వాంగ్మూలం కీలకగా మారింది. జనాలను చూసి తాను రైలును ఆపే ప్రయత్నం చేశానని..కానీ అక్కడున్న జనాలు రాళ్లు రువ్వడంతో రైలును ఆపలేదని చెప్పారు. తనకు ప్రయాణికుల భదత్రే ముఖ్యమని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: October 21, 2018, 4:53 PM IST
జనాలు కాదు..ప్రయాణికుల భద్రతే నాకు ముఖ్యం: లోకో పైలెట్
ఘటనాస్థలంలో స్థానికుల ఆందోళన
  • Share this:
అమృత్‌సర్‌లో రైలు ప్రమాదం జరిగి 2 రోజులు గడించింది. కానీ ఇప్పటి వరకు బాధ్యులెవరో తేలలేదు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన..అందులో పేర్లను
మాత్రం పేర్కొనలేదు. నిర్వాహకులు, స్థానికుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. రైలు పట్టాల సమీపంలో ఎటువంటి కార్యక్రమాలకు నిర్వహించకూడదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఇక ప్రమాదంపై లోకో పైలెట్ (రైలు డ్రైవర్) ఇచ్చిన వాంగ్మూలం కీలకగా మారింది. జనాలను చూసి తాను రైలును ఆపే ప్రయత్నం చేశానని..కానీ అక్కడున్న జనాలు రాళ్లు రువ్వడంతో రైలును ఆపలేదని చెప్పారు. తనకు ప్రయాణికుల భదత్రే ముఖ్యమని స్పష్టంచేశారు.

రైలు పట్టాలపై పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడి ఉన్నారు. గమనించిన వెంటనే కంటిన్యూగా హారన్ మోగించాను. ఆ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. కానీ అప్పటికే కొందరు రైళ్ల కిందకు వెళ్లిపోయారు. రైలు ఆగిపోయే స్థితికి వచ్చిన తరుణంలో..అక్కడున్న జనాలు రైలుపైకి రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. నాకు ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యత. అందుకే రైలును మళ్లీ ముందుకు పోనిచ్చాను.
అరవింద్ కుమార్, లోకో పైలెట్ఐతే 59 మంది చనిపోయిన ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరన్నది తేలడం లేదు. అటు పట్టణ మున్సిపాలిటీ సైతం..తాము రావణ దహన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రమాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. రావణ దహనానికి ముఖ్య అతిథిగా హాజరైన నవజోత్ కౌర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఐతే ప్రమాదంపై రాజకీయాలు చేయవద్దని..ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలన్నారు. ఘటనపై ఆయన న్యాయవిచారణకు ఆదేశించారు.First published: October 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు