హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సినిమా స్టైల్ లో 100 కార్లతో ఛేజ్ చేసి.. ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

సినిమా స్టైల్ లో 100 కార్లతో ఛేజ్ చేసి.. ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

స్వయం ప్రకటిత అతివాద సిక్కు మతబోధకుడు, అనుమానిత ఖలిస్తాన్ అనుకూల సంస్థ "వారిస్ పంజాబ్ డి" నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ ను(Amritpal Singh) పోలీసులు అరెస్ట్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Amritpal Singh Arrested : పంజాబ్(Punjab) లో హై టెన్షన్ నెలకొంది. స్వయం ప్రకటిత అతివాద సిక్కు మతబోధకుడు, అనుమానిత ఖలిస్తాన్ అనుకూల సంస్థ "వారిస్ పంజాబ్ డి" నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ ను(Amritpal Singh) పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జలంధర్ లోని నకోదర్ సమీపంలో అమృత్‌పాల్ సింగ్‌ తో పాటు మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ కు ముందు రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. అమృత్ పాల్ సింగ్ ను.. 100 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల సరిహద్దులను మూసేశారు. చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ఛేజింగ్ కొన్ని గంటల పాటు సాగింది. చివరికి అతడిని జల్లుపూర్ ఖేరా గ్రామం దగ్గర అరెస్ట్ చేశారు. అతడి మద్దతుదారులు ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమృత్‌పాల్ సింగ్‌ ను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారనే వార్తలతో పంజాబ్ లోని ప్రత్యేక వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పోలీసులు సైతం భారీగా మోహరించి చెదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భద్రత రీత్యా శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ పంజాబ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు, ఎంఎస్ఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పంజాబ్ హోంశాఖ ప్రకటించింది.

ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అని ChatGPTని అడిగాడు.. ఒక్కరోజులో కంపెనీ పెట్టి లక్షాధికారి అయ్యాడు

అసలేం జరిగిందంటే

ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ పోలీసులు లవ్ ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్ అనే వ్యక్తిని ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమ మద్దతుదారుడు అమృత్ పాల్ కు లవ్ ప్రీత్ సింగ్ అత్యంత సన్నిహితుడు. తన స్నేహితుడి అరెస్ట్ తో అమృత్ పాల్ సింగ్ రంగంలోకి దిగాడు. అమృత్ పాల్ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 24న అతడి మద్దతుదారులు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు తీవ్ర భయానక పరిస్థితులు సృష్టించడంతో పోలీసులు చేసేదిలేక లవ్ ప్రీత్ సింగ్ ను విడిచిపెట్టారు. అయితే, దీనివెనుక ఉన్న మాస్టర్ మైండ్ అమృత్ పాల్ సింగ్ ను మాత్రం ఇవాళ సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.

First published:

Tags: Punjab, Punjab news

ఉత్తమ కథలు