హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amith Shah : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది విజయం యావత్ దేశానికే గర్వకారణం

Amith Shah : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది విజయం యావత్ దేశానికే గర్వకారణం

ద్రౌపది ముర్ముకి అభినందనలు తెలిపిన అమిత్ షా

ద్రౌపది ముర్ముకి అభినందనలు తెలిపిన అమిత్ షా

 Amith Shah Congratulates Draupadi Murmu : భార‌త 15వ రాష్ట్రప‌తిగా ఎన్నికైన ద్రౌప‌ది ముర్ముకు(Draupadi Murmu) దేశ‌వ్యాప్తంగా అన్ని వర్గాలు, పార్టీల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత సాధారణ గిరిజన కుటుంబం నుండి వచ్చిన, NDA అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము జీ భారత రాష్ట్రపతిగా(President Of India)ఎన్నిక కావడం యావత్ దేశానికి గర్వకారణం అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) గురువారం రాత్రి ఓ ట్వీట్ లో తెలిపారు.

ఇంకా చదవండి ...

  Amith Shah Congratulates Draupadi Murmu : భార‌త 15వ రాష్ట్రప‌తిగా ఎన్నికైన ద్రౌప‌ది ముర్ముకు(Draupadi Murmu) దేశ‌వ్యాప్తంగా అన్ని వర్గాలు, పార్టీల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత సాధారణ గిరిజన కుటుంబం నుండి వచ్చిన, NDA అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము జీ భారత రాష్ట్రపతిగా(President Of India)ఎన్నిక కావడం యావత్ దేశానికి గర్వకారణం అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) గురువారం రాత్రి ఓ ట్వీట్ లో తెలిపారు. ద్రౌపది ముర్ము విజయం అంత్యోదయ సంకల్పం, గిరిజన సమాజ సాధికారతను సాధించే దిశలో ఒక మైలురాయి అని అమిత్ షా ఆ ట్వీట్ లో తెలిపారు. మోడీ జీ నాయకత్వంలో, గిరిజన ప్రైడ్ శ్రీమతి ద్రౌపది ముర్ము జీకి అనుకూలంగా ఓటు వేసినందుకు NDA మిత్రపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ముర్మూజీ పదవీకాలం దేశాన్ని మరింత గర్వించేలా చేస్తుందని భావిస్తున్నాను"అని మరో ట్వీట్ లో షా తెలిపారు. "శ్రీమతి ద్రౌపది ముర్ము జీ ఎన్నో కఠిన పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు దేశంలోని ఈ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు, ఇది మన ప్రజాస్వామ్యం యొక్క అపారమైన శక్తిని తెలియజేస్తుంది"వరుస ట్వీట్లలో అమిత్ షా తెలిపారు.

  రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం తర్వాత . దేశ‌వ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబ‌రాల‌ను మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని ముర్ము నివాసానికి బీజేపీ అగ్ర నేత‌లు క్యూ క‌ట్టారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ముర్ము నివాసానికి వెళ్లి ఆమెకు అభినందనలు తెలిపారు. ముర్ముకు అభినంద‌న‌లు తెలిపిన అమిత్ షా... త‌న చేతుల‌తో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అమిత్ షా అక్క‌డి నుంచి వెళ్లిన కాసేపటికి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ముర్ము నివాసానికి వ‌చ్చి ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్రౌపది ముర్ము నివాసానికి వెళ్లి ఆమెను విష్ చేశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

  4 Zodiac Signs : రాబోయే 119 రోజులు ఈ నాలుగు రాశుల వారికి మహర్దశ..పట్టిందల్లా బంగారమే!

  ఒడిషా(Odisha) రాష్ట్రంలోని మయూర్‌ భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలోని గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో జూన్ 20,1958 న ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. తాతలు పంజాయితీరాజ్ వ్యవస్థలోని గ్రామాధికార్లుగా ఉండేవారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒడిషా ప్రభుత్వంలో సచివాలయంలో క్లరికల్ పోస్ట్‌లో ముర్ము చేరారు. రాయంగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో పనిచేసే శ్యామ్ చరణ్ ముర్ముని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. అయితే ఇద్దరు కుమారులు చనిపోయారు. భర్త శ్యామ్ చరణ్ 2014లో మరణించారు.

  ద్రౌపది ముర్ము 1997లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. రాయ్‌రంగపూర్ నగర పంచాయితీ కౌన్సిలర్‌‌గా ఎన్నికయ్యారు. బీజేపీ గిరిజన తెగల మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత 2000వ సంవత్సరంలో జరిగిన ఒడిషా శాసనసభ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో 2000 మార్చి నుంచి 2002 వరకు వాణిజ్యం, రవాణాకు స్వతంత్ర బాధ్యతలు నిర్వహించారు. 2004 లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2009 వరకు మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, 2006 నుంచి 2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా, 2010లో మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, 2013 నుంచి 2015 వరకు మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, బీజేపీ ఒడిషా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేశారు. ద్రౌపది ముర్ముకు 2007లో ఒడిశా శాసనసభ ఉత్తమ శాసనసభ్యురాలిగా నికంఠ పురస్కారాన్ని అందించింది. ద్రౌపది ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్రపతి పదవీ అధిరోహించబోతున్నారు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Amit Shah, Draupadi Murmu, President of India

  ఉత్తమ కథలు