news18-telugu
Updated: October 28, 2020, 8:49 PM IST
కేబీసీ కంటెస్టెంట్‌కు అమితాబ్ బచ్చన్ వార్నింగ్
కౌన్ బనేగా క్రోర్‌పతి టీవీషోలో పాల్గొన్న ఒక వ్యక్తికి అమితాబ్ బచ్చన్ సున్నితమైన వార్నింగ్ ఇచ్చాడు. తన భార్యకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని చెప్పినందుకు కంటెస్టెంట్‌పై బిగ్‌బీకి కోపం వచ్చింది. హాస్యానికి కూడా మహిళలను అవమానించేలా మాట్లాడవద్దని సీనియర్ బచ్చన్ అతడికి క్లాస్ తీసుకున్నాడు. ప్రస్తుతం కేబీసీ 12వ సీజన్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలి ఎపిసోడ్లో మధ్యప్రదేశ్‌కు చెందిన కోష్లేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నాడు.
అతడు రూ.20 వేలు విలువ ఉండే ఆరో ప్రశ్న వరకు ఒక్క లైఫ్‌లైన్ మాత్రమే ఉపయోగించాడు. రూ.40,000 విలువ చేసే ఏడవ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ‘సమ్మర్ ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించిన ఏకైక భారతీయ మహిళ ఎవరు?’ అనే ప్రశ్నకు.. పీవీ సింధు, మేరీ కోమ్, కరణం మల్లేశ్వరి, సాక్షి మాలిక్ ఆప్షన్లను ఇచ్చారు. తోమర్ ముందు "వీడియో కాల్ ఎ ఫ్రెండ్" లైఫ్‌లైన్‌ను ఎంచుకున్నాడు. అతడి స్నేహితుడు సాక్షి మాలిక్ కావచ్చని, తనకు కూడా సరిగా తెలియదని చెప్పాడు. దీంతో తోమర్ "50-50" ఛాన్స్‌ను ఎంచుకున్నాడు. ఈ లైఫ్‌లైన్ మేరీ కోమ్, సాక్షి మాలిక్ ఆప్షన్లను తొలగించింది. ఇంకా సరైన సమాధానాన్ని గుర్తించలేకపోవడంతో చివరి లైఫ్ లైన్ "ఆస్క్ ద ఎక్స్పర్ట్" తీసుకున్నాడు. దీని ద్వారా పీవీ సింధు సరైన సమాధానం అని గుర్తించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలుచుకుంది. ఈ ప్రశ్నలో మరో ఆప్షన్‌గా ఉన్న కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ. ఆమె 2000 సిడ్నీ ఒలంపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్యం సాధించింది.
బోర్ కొట్టింది అన్నందుకే వార్నింగ్...
ఆ తరువాత మరో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక తోమర్ షో నుంచి వెళ్లిపోయాడు. "ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, 1857" పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడిగిన ప్రశ్నకు అతడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. మాటల మధ్యలో... ఈ షోలో గెలుచుకున్న ప్రైజ్ మనీతో ఏం చేస్తావని అమితాబ్ తోమర్‌ను అడిగాడు. తన భార్యకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని అతడు సమాధానం ఇచ్చాడు. ఎందుకు అని అడిగినప్పుడు... గత 15ఏళ్లుగా భార్య మొహం చూసి బోర్ కొట్టిందని చెప్పడంతో బిగ్‌బీ ఆశ్చర్యపోయాడు. తోమర్ భార్యకు ఫోన్ చేయించి ఆమెతో వీడియో కాల్లో మాట్లాడాడు. తన భర్త మాటలను పట్టించుకోవద్దని చెప్పాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తరువాత పరిస్థితులు సాధారణ స్థాయికి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని సమస్యల గురించి వివరించాడు. హాస్యాస్పదంగా కూడా ఇలా చెప్పకూడదని తోమర్‌కు అమితాబ్ వార్నింగ్ ఇచ్చాడు.
Published by:
Kishore Akkaladevi
First published:
October 28, 2020, 8:42 PM IST