నా లివర్ పూర్తిగా పాడైంది...అమితాబ్ షాకింగ్ కామెంట్స్

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని.. అప్పుడే ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు అమితాబ్ బచ్చన్.

news18-telugu
Updated: August 19, 2019, 4:13 PM IST
నా లివర్ పూర్తిగా పాడైంది...అమితాబ్ షాకింగ్ కామెంట్స్
అమితాబ్ బచ్చన్
  • Share this:
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యంపై సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన లివర్‌లో 75శాతం పూర్తిగా దెబ్బతిందని.. మిగిలిన 25శాతం కాలేయంతోనే తాను జీవిస్తున్నానని వెల్లడించారు. అంతేకాదు గతంలో క్షయ, హైపటైటిస్ బీ వంటి వ్యాధులతో పోరాడానని తెలిపారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమితాబ్ బచ్చన్. అంతేకాదు తనకు క్షయవ్యాధి ఉందన్న విషయాన్ని 8 ఏళ్లు ఆలస్యంగా గుర్తించానని చెప్పారు.

గతంలో నాకు క్షయ, హైపటిటైటిస్ బీ వ్యాధులు ఉండేవి. నాకు క్షయ వ్యాధి ఉందన్న సంగతి 8 ఏళ్లు ఆలస్యంగా తెలిసింది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే వ్యాధి ఉందన్న సంగతి తెలియలేదు. నా లివర్‌లో 75శాతం పూర్తిగా పాడైపోయింది. మిగిలిన 25శాతం లివర్‌తోనే బతుకుతున్నా. ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోతే మీకు ఏం వ్యాధి ఉందో తెలియదు.
అమితాబ్ బచ్చన్


76 ఏళ్ల అమితాబ్ బచ్చన్ పలు ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఉన్నారు. పోలియో, హైపటైటిస్-బీ, క్షయ, డయాబెటిస్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు బిగ్‌బీ. ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటేనే మనలో ఉన్న వ్యాధులు బయటపడతాయని ప్రజలకు సూచించారు. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని.. అప్పుడే ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు అమితాబ్ బచ్చన్.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>